Champions Trophy tour : భారత్‌ను కవ్వించాలనుకున్న పాకిస్థాన్.. షాకిచ్చిన ఐసీసీ!
భారత్‌ను కవ్వించాలని అనుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రయత్నాలకు ఐసీసీ అడ్డుపడింది.

ICC orders Pakistan to cancel Champions Trophy 2025 tour in PoK Report
భారత్‌ను కవ్వించాలని అనుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రయత్నాలకు ఐసీసీ అడ్డుపడింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నిర్వహించ తలపెట్టిన ఛాంపియన్ ట్రోఫీ టూర్‌ను రద్దు చేసింది.
వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్ ట్రోఫీ జరగనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఇంకా విడుదల చేయలేదు. అయినప్పటికి ట్రోఫీ టూర్‌ను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా తొలుత కప్పును పాక్‌కు పంపింది ఐసీసీ. ఈ క్రమంలో ట్రోఫీ టూర్ షెడ్యూల్‌ను పాక్ ప్రకటించింది. ఈ నెల 16 నుంచి ట్రోఫీ టూర్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
ఇస్లామాబాద్ నుంచి ట్రోఫీ టూర్ ప్రారంభం అవుతుందని చెప్పింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని స్కర్దు, హుంజా, ముజఫరాబాద్ ప్రాంతాల్లో కూడా ట్రోఫీ టూర్ షెడ్యూల్‌లో చేర్చింది. భారత్‌ను కవ్వించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఛాంపియన్ ట్రోఫీ కోసం పాక్‌లో అడుగుపెట్టమని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి స్పష్టం చేసింది. ఆసియా కప్ తరహాలోనే ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించాలని కోరింది.
బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం పాక్‌కు నచ్చలేదు. పాక్ ఈ రూపంలో తన వక్ర బుద్ధిని బయటపెట్టింది. దీంతో వెంటనే స్పందించిన భారత్ ఐసీసీ ముందు అభ్యంతరం నెత్తింది. వెంటనే ఐసీసీ స్పందించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ టూర్‌ను రద్దు చేసింది.
Sanju Samson : దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20 మ్యాచ్.. ఈ మ్యాచ్‌లోనూ సంజూ శాంసన్ డకౌట్ అయితే?