ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ రేసులో భారత్‌ టాప్

ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ రేసులో భారత్‌ టాప్

Updated On : April 1, 2019 / 10:47 AM IST

ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్‌లో భారత్ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దీనికిగాను గౌరవ పురస్కారంగా మిలియన్ డాలర్లను ఐసీసీ బీసీసీఐకి ఇవ్వనుంది. ఎమ్మారెఫ్ టైర్స్ ఐసీసీ టెస్టు టీం ర్యాంకింగ్స్‌లో మూడో సంవత్సరం అగ్రస్థానంలో భారత్ కొనసాగుతుండటమే ఇందుకు కారణం. ఏప్రిల్ 1 నాటికి లెక్కల ప్రకారం.. అగ్రస్థానంలో ఇండియా ఉంటే న్యూజిలాండ్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. 

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ హోదాను ఇండియా మరో సారి దక్కించుకోవడం గర్వంగా ఉంది. అన్ని ఫార్మాట్లలోనూ భారత్ అద్భుతంగా దూసుకెళ్తోంది. టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కించుకోవడం అదనపు సంతోషాన్ని తెచ్చిపెట్టింది. క్రికెట్ అన్నీ ఫార్మాట్లలో టెస్టు ఫార్మాట్ ఎంతో గొప్పదో మనందరికీ తెలుసు. ఈ సత్తా ఇలాగే కొనసాగించి టెస్టు క్రికెట్‌లో భారత్ మరింత ముందుకు వెళ్లేందుకు మేమంతా శ్రమిస్తాం’ అని తెలిపాడు. 

ఐసీసీ సీఈవో మనూ స్వాహ్ని మాట్లాడుతూ.. ‘భారత్ టెస్టు చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నందుకు అభినందనలు. కొన్నేళ్ల నుంచి కోహ్లీ జట్టు.. అన్ని ఫార్మాట్లలోనూ పైచేయి సాధిస్తోంది. జట్టు పట్టుదల, కృషి వల్లే టెస్టు క్రికెట్లో టాప్ స్థానంలో నిలబెట్టాయి. 2021లో జరగనున్న ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో తలపడేందుకు అర్హత కోసం.. 9దేశాలు 27 సిరీస్‌లలో 71 టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి’ అని తెలిపాడు.