Rohit Sharma : ఇంగ్లాండ్‌తో రెండో వన్డే.. అరుదైన రికార్డు పై రోహిత్ శర్మ కన్ను.. సెహ్వాగ్‌కు, సచిన్‌కు మధ్యలో..
అంతర్జాతీయ క్రికెట్‌లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుపై కన్నేశాడు.

Rohit Sharma nears Sachin tally in elite openers club
టీమ్ఇండియా అత్యుత్తమ ఓపెనర్లలో రోహిత్ శర్మ ఒకరు. ఇంగ్లాండ్‌తో రెండో వన్డే ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఓ అరుదైన రికార్డు పై రోహిత్ శర్మ కన్నేశాడు. రోహిత్ మరో 50 పరుగులు సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఓపెనర్ల జాబితాలో అతడు రెండో స్థానానికి చేరుకుంటాడు. ఈ క్రమంలో అతడు సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేయనున్నాడు.
సచిన్ 346 మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చాడు. 48.07 సగటుతో 15335 పరుగులు చేశాడు. ఇక రోహిత్ విషయానికి వస్తే.. 342 మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా వచ్చి 45.22 సగటుతో 15285 పరుగులు సాధించాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో టీమ్ఇండియా తరుపున ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన రికార్డు నజాఫ్‌గఢ్ నవాబ్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 332 మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా వచ్చి 45.22 సగటు 16,119 పరుగులు సాధించాడు.
Rohit Sharma : రోహిత్ శర్మ తాజా ఫామ్ పై కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు.. సారథే ఇలా ఉంటే..
ఇక ఓవరాల్‌గా తీసుకుంటే ఓపెనర్‌గా వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక క్రికెట్ దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్య అగ్రస్థానంలో ఉన్నాడు. 506 మ్యాచ్‌ల్లో 19,298 పరుగులు చేశాడు. ఆ తరువాత వరుసగా క్రిస్‌గేల్, డేవిడ్ వార్నర్, గ్రేమ్ స్మిత్ లు ఉన్నారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్లు వీరే..
సనత్ జయసూర్య (శ్రీలంక) – 506 మ్యాచ్‌ల్లో 19298 పరుగులు
క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 441 మ్యాచ్‌ల్లో 18867 పరుగులు
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) – 374 మ్యాచ్‌ల్లో 18744 పరుగులు
గ్రేమ్ స్మిత్ (దక్షిణాప్రికా) – 342 మ్యాచ్‌ల్లో 16950 పరుగులు
డెస్మండ్ హేన్స్ (వెస్టిండీస్)- 354 మ్యాచ్‌ల్లో 16120 పరుగులు
వీరేంద్ర సెహ్వాగ్ (భారత్) – 332 మ్యాచ్‌ల్లో 16119 పరుగులు
సచిన్ టెండూల్కర్ (భారత్) – 346 మ్యాచ్‌ల్లో 15335 పరుగులు
రోహిత్ శర్మ (భారత్) – 342 మ్యాచ్‌ల్లో 15,285 పరుగులు
ఇదిలా ఉంటే.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్ ఫామ్ అందుకోవాలని సగటు భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. ఒక్కసారి హిట్‌మ్యాన్ జోరు అందుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత విజయావకాశాలు మెరుగుఅవుతాయి.