IND vs SA : మూడు వికెట్లు తీసిన కుల్దీప్.. అయినా గానీ సఫారీలదే తొలి రోజు..
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA) గౌహతి వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
IND vs SA 1st Test Stumps Day 1 South Africa are 247 runs loss of 6 wickets
IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య గౌహతి వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో (IND vs SA) తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు నష్టపోయి 247 పరుగులు చేసింది. సేనురన్ ముత్తుసామి (25), కైల్ వెరియన్నే (1) లు క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీశాడు. బుమ్రా, జడేజా, సిరాజ్‌లు తలా ఓ వికెట్ సాధించారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ టెంబా బవుమా మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అతడి అంచనాలను నిజం చేస్తూ ఓపెనర్లు ఐడెన్ మార్‌క్రమ్ (38; 81 బంతుల్లో 5 ఫోర్లు), ర్యాన్ రికెల్టన్ (35; 82 బంతుల్లో 5 ఫోర్లు) దక్షిణాఫ్రికాకు శుభారంభాన్ని అందించారు. 81 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాకరంగా మారిన ఈ జోడీని టీ విరామానికి ముందు మార్‌క్రమ్‌ను ఔట్ చేయడం ద్వారా బుమ్రా విడదీశాడు.
Stumps on Day 1!
An absorbing day’s play comes to an end! 🙌
3⃣ wickets for Kuldeep Yadav
1⃣ wicket each for Jasprit Bumrah, Ravindra Jadeja and Mohd. SirajScorecard ▶️ https://t.co/Hu11cnrocG#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/XwAptOQ13s
— BCCI (@BCCI) November 22, 2025
టీ విరామం తరువాత తొలి ఓవర్‌లోనే ర్యాన్ రికెల్టన్‌ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయడంతో స్వల్ప వ్యవధిలో సఫారీలు రెండు వికెట్లు కోల్పోయారు. ఈ దశలో ట్రిస్టన్ స్టబ్స్ (49; 112 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), టెంబా బవుమా (41; 92 బంతుల్లో 5 ఫోర్లు) లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
జడేజా బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ అద్భుత క్యాచ్ అందుకోవడంతో బవుమా ఔట్ కాగా మరికాసేటికే హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో కుల్దీప్ బౌలింగ్‌లో స్లిప్‌లో కేఎల్ రాహుల్ క్యాచ్ అందుకోవడంతో స్టబ్స్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. మరికాసేపటికే వియాన్ ముల్డర్ (13) ఔట్ కావడంతో 201 పరుగులకే దక్షిణాఫ్రికా ఐదు వికెట్లను కోల్పోయింది. ముల్డర్‌ను కుల్దీప్ పెవిలియన్‌కు చేర్చాడు. కాగా.. తొలి రోజు ఆట కొద్దిసేపటిలో ముగుస్తుందనగా టోనీ డి జోర్జీ (28; 59 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ను సిరాజ్ ఔట్ చేశాడు.
