Ind Vs SL : విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ.. శ్రీలంక ముందు భారీ లక్ష్యం

శ్రీలంకతో మూడో వన్డేలో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. పరుగుల వరద పారించారు. ముఖ్యంగా శుభ్ మాన్ గిల్, విరాట్ కోహ్లీ సెంచరీలో చెలరేగారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరగులు చేసింది. లంక ముందు 391 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది.

Ind Vs SL : విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ.. శ్రీలంక ముందు భారీ లక్ష్యం

Updated On : January 15, 2023 / 5:58 PM IST

Ind VS SL : శ్రీలంకతో మూడో వన్డేలో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. పరుగుల వరద పారించారు. ముఖ్యంగా శుభ్ మాన్ గిల్, విరాట్ కోహ్లీ సెంచరీలతో చెలరేగారు. దీంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. లంక ముందు 391 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది.

ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 97 బంతుల్లో 116 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. ఇక విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ బాదాడు. కోహ్లీ 110 బంతుల్లో 166 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 8 సిక్సులు ఉన్నాయి. 85 బంతుల్లోనే విరాట్ సెంచరీ బాదాడు. ఈ సిరీస్ లో రెండో శతకం. కెప్టెన్ రోహిత్ శర్మ 42 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 38 పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో లహిరు కుమార, కసున్‌ రజిత చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కరుణరత్నె ఒక వికెట్‌ తీశాడు.

Also Read..MS Dhoni: గత వరల్డ్ కప్ తర్వాతే రిటైర్ కావాలకున్న ధోనీ.. వెల్లడించిన మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్

తొలుత కెప్టెన్‌ రోహిత్ శర్మ (42) శుభారంభం ఇచ్చాడు. ఆ తర్వాత శుభ్‌మన్‌ గిల్ (116), విరాట్ కోహ్లీ (166*) సెంచరీలతో చెలరేగిపోయారు. గిల్‌కు వన్డేల్లో ఇది రెండో సెంచరీ కాగా.. కోహ్లీకి 46వ సెంచరీ. శ్రేయస్‌ (38) కూడా రాణించాడు. రాహుల్‌ (7), సూర్య (4) నిరాశపరిచారు.

Also Read..Indian Cricketer Ashwin: కెప్టెన్ రోహిత్‌శర్మ నిర్ణయాన్ని తప్పుబట్టిన అశ్విన్.. అలాచేయడం సరికాదంటూ ..

ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకొంది. నామ మాత్రమైన చివరి వన్డే మ్యాచ్‌ తిరువనంతపురం వేదికగా జరుగుతోంది. టాస్‌ నెగ్గిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌ ఎంచుకొన్నాడు. రోహిత్ నమ్మకాన్ని మన బ్యాటర్లు వమ్ము చేయలేదు. పరుగుల వరద పారించారు. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని భారత్ ఉవ్విళ్లూరుతుండగా.. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని శ్రీలంక భావిస్తోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.