T20 World Cup: నిలవాలంటే గెలవాలి.. ఓటమెరుగని కివీస్‌తో భారత్‌కు ముఖ్యమైన మ్యాచ్!

వరల్డ్ కప్(ICC T20 WC)లో, ఆదివారం(31 అక్టోబర్ 2021) భారత్(IND), న్యూజిలాండ్(NZ) మధ్య ముఖ్యమైన మ్యాచ్ జరగబోతుంది.

T20 World Cup: నిలవాలంటే గెలవాలి.. ఓటమెరుగని కివీస్‌తో భారత్‌కు ముఖ్యమైన మ్యాచ్!

India

Updated On : October 31, 2021 / 10:19 AM IST

T20 World Cup: ICC T20 వరల్డ్ కప్(ICC T20 WC)లో, ఆదివారం(31 అక్టోబర్ 2021) భారత్(IND), న్యూజిలాండ్(NZ) మధ్య ముఖ్యమైన మ్యాచ్ జరగబోతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో గెలుపొందిన జట్టుకే సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఓడిన జట్టుకు సెమీఫైనల్ మార్గం చాలా కష్టం. ఈ క్రమంలో న్యూజిలాండ్‌పై టీమ్‌ఇండియా ఎటువంటి వ్యూహం రచిస్తుంది అనేది ఇంట్రస్టింగ్ టాపిక్.

చివరి మ్యాచ్‌లో..
ఎంతో బలమైన జట్టుగా పేరున్న భారత్ ప్రదర్శన పాకిస్థాన్‌పై ఫస్ట్ మ్యాచ్‌లో నిరాశపరిచింది. ఓపెనర్ రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాటపట్టగా, కేఎల్ రాహుల్ 3 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 57పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి రాణించాడు. రిషబ్ పంత్ 39 పరుగులు చేశాడు. దీంతో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో బౌలర్లు చెత్త బౌలింగ్ చేశారు. జట్టు బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.

చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్ కూడా పాకిస్థాన్‌పై పరాజయం పాలైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ ఎవరూ 30 పరుగుల మార్కును దాటలేదు. బౌలింగ్ విషయానికి వస్తే, స్పిన్నర్ ఐష్ సోధి రెండు వికెట్లు తీయగా, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ సాంత్నర్ తలో వికెట్ తీశారు.

భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌ల విషయానికి వస్తే, ఇప్పటివరకు భారత్‌పై కివీస్‌దే పైచేయిగా ఉంది. 2003 ప్రపంచకప్ తర్వాత ఐసీసీ టోర్నీలో ఇప్పటివరకు భారత జట్టు న్యూజిలాండ్‌ను ఓడించలేదు. 2007లో టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీని తర్వాత 2016 టీ20 ప్రపంచకప్‌లోనూ భారత జట్టు పరాజయం పాలైంది. 2019 సంవత్సరంలో ODI ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో భారత్ 18 పరుగుల తేడాతో కివీస్ చేతిలో ఓడిపోయింది. అదే ఏడాది జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టు భారత్‌ను ఓడించింది. ఇలా ఓటమెరుగని కివీస్‌తో ముఖ్యమైన మ్యాచ్‌లో భారత్ ఆడవల్సి వస్తుంది.

బలం, బలహీనతలు ఇవే..
భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, KL రాహుల్ వంటి స్టార్ బ్యాట్స్‌మెన్లు, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు ఉన్నారు, వారు మ్యాచ్‌ని వన్ సైడ్ చెయ్యగలరు. కానీ, గత మ్యాచ్‌లో ముఖ్యమైన వాళ్లు ఎవరూ రాణించలేదు. మరోవైపు న్యూజిలాండ్ జట్టులో కేన్ విలియమ్సన్, మార్టిన్ గప్తిల్ వంటి సీనియర్ బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. బౌలింగ్ విషయానికి వస్తే, ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, స్పిన్నర్ ఇష్ సోధీల త్రయం భారత బ్యాట్స్‌మెన్‌ని ఇబ్బంది పెట్టొచ్చు. చూడాలి మరి ఎవరు గెలుస్తారో!