RCB అస్సలు గెలవకపోవడానికి కారణమిదే

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీజన్లు మారినా.. కెప్టెన్లు మారినా.. ఫ్రాంచైజీ తలరాత మారలేదు. ఒక్కసారి కూడా టైటిల్ గెలుచుకోకుండానే 12వ సీజన్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైపోయింది. ద్రవిడ్ కెప్టెన్సీ తర్వాత కోహ్లీ కెప్టెన్ పగ్గాలు చేపట్టినప్పటికీ జట్టు తీరు ఏ మాత్రం మారలేదు. ఆర్సీబీ టైటిల్ గెలుచుకోకపోవడం అంశంపై విరాట్ కోహ్లీ స్వయంగా మ్యాచ్ కోసం తీసుకుంటున్న నిర్ణయాల్లో వైఫల్యమే జట్టు ఓడిపోయేలా చేస్తుందని స్వయంగా ఒప్పుకున్నాడు.
Read Also : అదే డబ్బును ఇలా: బీసీసీఐ రూ.20 కోట్లు ఇవ్వనుంది
‘జట్టు కోసం తీసుకున్న నిర్ణయాల వల్లే ఓడిపోతున్నాం. అంతేకానీ, దీనిని అదృష్టం లేదు, మా తలరాత అని సమర్థించుకోను. ఎవరి రాతను వారే రాసుకోవాలి. మనకంటే ప్రత్యర్థి జట్టు కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటే ఓడిపోతాం. ఏ సీజన్ ఫలితం ఎలా వస్తుందోనని ఎవ్వరూ అంచనా వేయలేరు. ఎంత పెద్ద మ్యాచ్‌లలోనైనా ఇది తప్పనిసరి’
వరల్డ్ కప్‌కు ముందు జరగనున్న దేశీవాలీ లీగ్ కావడంతో ప్లేయర్లంతా తమ బ్యాటింగ్ శైలిని పదునుపెట్టే పనిలో పడ్డారు. ఇప్పటికే 8 ఫ్రాంచైజీలు వారి సొంతగడ్డపై ప్రాక్టీసును ముమ్మరం చేశాయి. కోహ్లీ జట్టు సొంతగడ్డపై ప్రాక్టీస్ మ్యాచ్‌లు షురూ చేసింది.
Read Also : నువ్వు తోపు బాసూ : 2020 వరకు రవిశాస్త్రినే