IPL 2021 RR Vs CSK : సెంచరీతో కదంతొక్కిన రుతురాజ్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్

ఐపీఎల్ రెండో దశలో భాగంగా రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై చెలరేగింద

IPL 2021 RR Vs CSK : సెంచరీతో కదంతొక్కిన రుతురాజ్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్

Ruturaj Gaikwad

Updated On : October 2, 2021 / 9:36 PM IST

IPL 2021 RR Vs CSK : ఐపీఎల్ రెండో దశలో భాగంగా రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై చెలరేగింది. సూపర్ ఫామ్ లో ఉన్న చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్ లో చెలరేగాడు. సెంచరీతో కదం తొక్కాడు. 60 బంతుల్లో సెంచరీ(101) బాదాడు.

ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టడం ద్వారా రుతురాజ్ సెంచరీ నమోదు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 5 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. రుతురాజ్ నాటౌట్ గా నిలిచాడు. రుతురాజ్ విజృంభణతో చెన్నై భారీ స్కోర్ చేసింది. నిర్ణీత ఓవర్లలో సీఎస్కే 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. డుప్లెసిస్ 25 పరుగులు, మోయిన్ అలీ 21 పరుగులు, జడేజా 32 పరుగులు(నాటౌట్) చేశారు. రాజస్తాన్ బౌలర్లలో రాహుల్ తెవాటియా 3 వికెట్లు తీశాడు. చేతన్ సకారియా ఒక వికెట్ తీశాడు.