IPL 2025 : ఢిల్లీ వర్సెస్ బెంగళూరు.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే..
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి..

Courtesy BCCI
IPL 2025: ఢిల్లీ వేదికగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ గెలవాలంటే బెంగళూరు 163 పరుగులు చేయాలి. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ ఒక్కడే రాణించాడు. 39 బంతుల్లో 41 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్టబ్స్ 34 పరుగులు, పోరెల్ 28 పరుగులు, డుప్లెసిస్ 22 పరుగులు చేశారు.
చివరలో స్టబ్స్ బౌండరీలు బాదడంతో ఢిల్లీ ఓ మోస్తరు స్కోర్ అయినా చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీశాడు. హేజిల్ వుడ్ 2 వికెట్లు పడగొట్టాడు. యశ్ దయాల్, కృనాల్ పాండ్య తలో వికెట్ తీశారు.
Also Read: ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల భార్యల గురించి తెలుసా? వారందరూ వీరే.. ఎంతగా సపోర్ట్ చేస్తున్నారంటే?