IPL 2025 : బెంగళూరుని చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్..
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

Courtesy BCCI
IPL 2025 : ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ గెలుపొందింది. 8 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది జీటీ. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.
Also Read : పంత్‌కు వేలు చూపిస్తూ లక్నో యజమాని సీరియస్ డిస్కషన్.. మదన్ లాల్ ఏమన్నారంటే..
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. 17.5 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ఫినిష్ చేసింది. మరో 13 బంతులు మిగిలి ఉండగానే విక్టరీ కొట్టింది. జోస్ బట్లర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. బట్లర్ 39 బంతుల్లోనే 73 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. జట్టుకి ఈజీ విక్టరీ అందించాడు. ఓపెనర్ సాయి సుదర్శన్ శుభారంభం ఇచ్చాడు. 36 బంతుల్లో 49 పరుగులు చేశాడు. రూథర్ ఫోర్డ్ 18 బంతుల్లో 30 పరుగులు చేశాడు.