IPL 2025: పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ రద్దు తర్వాత అక్కడేం జరిగింది.. ఇరు జట్ల ప్లేయర్లు ఏం చేశారంటే.? వీడియోలు వైరల్

ధర్మశాల స్టేడియంలో మ్యాచ్ రద్దు తరువాత ఇరు జట్ల క్రికెటర్లు వెంటనే మైదానం నుంచి వెళ్లిపోయారు.. ఆ తరువాత..

IPL 2025: పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ రద్దు తర్వాత అక్కడేం జరిగింది.. ఇరు జట్ల ప్లేయర్లు ఏం చేశారంటే.? వీడియోలు వైరల్

PBKS vs DC

Updated On : May 9, 2025 / 11:51 AM IST

IPL 2025: భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ ఆర్మీ గురువారం రాత్రి భారత్ లోని పలు సరిహద్దు ప్రాంతాలపై దాడులు నిర్వహించింది. అయితే, భారత్ ఆర్మీ పాక్ దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టింది. సరిగ్గా పాక్ దాడులకు తెగబడిన సమయంలోనే హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ (PBKS), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది.

Also Read: IPL 2025: భారత్-పాక్ వార్ ఎఫెక్ట్.. ఐపీఎల్ రద్దవుతుందా.. బీసీసీఐ ఏం చెప్పిందంటే..?

పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ చేస్తుంది. 10.1 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 122 పరుగులు చేసింది. అదే సమయంలో (రాత్రి 9.35గంటలు) స్టేడియంలో ఓవైపు భాగంలో ఫ్లడ్ లైట్లు ఆగిపోయాయి. అయితే, అంతా విద్యుత్ అంతరాయం వల్ల అలా జరిగిందని భావించారు. మళ్లీ మ్యాచ్ జరుగుతుందని అనుకున్నారు. ఆటగాళ్లుసైతం మైదానంలోనే ఉన్నారు. కొద్దినిమిషాల తరువాత ఆటగాళ్లు మైదానం నుంచి వెళ్లిపోవటం ప్రారంభించారు. మరోవైపు స్డేడియం సిబ్బంది ప్రేక్షకులను నెమ్మదిగా పంపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

Also Read: IPL 2025: ‘నా వయస్సు 42ఏళ్లు’.. ఐపీఎల్ రిటైర్మెంట్ పై ఎంఎస్ ధోనీ కీలక కామెంట్స్.. ఎప్పుడు రిటైర్ అవుతారంటే.?

హిమాచల్ క్రికెట్ సంఘం (హెచ్పీసీఏ) అధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రేక్షకులు ఎలాంటి భయాందోళనకు గురికాలేదు. ప్రేక్షకులు, ఆటగాళ్లను జాగ్రత్తగా, సురక్షితంగా స్టేడియం నుంచి తరలించామని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధమాల్ స్టేడియం వదిలి వెళ్లమని ప్రేక్షకులకు సంజ్ఞ చేస్తున్నట్లు కనిపించింది. మరోవైపు ధర్మశాలలో ఉన్న ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, ప్రసార సిబ్బందిని సురక్షితంగా తరలించేందుకు అప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రెండు జట్ల ఆటగాళ్లను బస్సు ఎక్కించి వారికి కేటాయించిన హోటల్ కు వెళ్లమని కోరారు. అయితే, చాలా మంది ఆటగాళ్లు తమ ప్యాడ్ లను తొలగించే సమయంలో లేకపోవటంతో ప్యాడ్ లతోనే బస్సు ఎక్కే పరిస్థితి ఏర్పడింది.

 

‘‘సమీపంలోని పఠాన్ కోట్ లో దాడుల గురించి మాకు చెప్పారు. వెంటనే హోటల్ కు తిరిగి వెళ్లమని మాకు సూచించారు. కొంత భయాందోళనలు ఉన్నాయి. ఇరు జట్ల ఆటగాళ్లం తమకు కేటాయించిన బస్సుల్లోకి వెళ్లి కూర్చున్నాం. ఆ తరువాత మేము బయటకు వెళ్లాలనుకున్నాము. కానీ, అక్కడ భారీ జనసమూహం ఉంది. విదేశీ ఆటగాళ్లు కొంత ఆందోళన చెందారు. వారిలో చాలా మంది స్వదేశానికి తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నారని ఓ ఆటగాడు చెప్పినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ నివేదించింది. ఇదిలాఉంటే.. ఆటగాళ్లు ఆ ప్రాంతంను విడిచి వెళ్లడానికి విమానాశ్రయాలు మూసివేసి ఉన్నాయి. దీంతో ధర్మశాల నుంచి ఆటగాళ్లను ఢిల్లీకి తరలించేందుకు బీసీసీఐ వందే భారత్ రైలును ఏర్పాటు చేసింది. ధర్మశాలకు దగ్గరగా ఉండే ఉనా స్టేషన్‌ నుంచి రెండు జట్ల ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, మ్యాచ్‌ అధికారులను తరలించనున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి.


ధర్మశాల మైదానం నుంచి ప్రేక్షకులు వెళ్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఇందులో ఓ వ్యక్తి ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘మనం దేనికి భయపడాలి..? మనం మన దేశంలో ఉన్నాము. ఏవరైనా భయపడితే అది పాకిస్థాన్ అయి ఉండాలి.. భారత్ మాతాకీ జై’’ అంటూ పేర్కొన్నాడు. అయితే, అర్థగంటపాటు ఆ ప్రాంతంలో ఆందోళనకర వాతావరణం కనిపించిందని పలువురు ప్రేక్షకులు చెప్పారు.