IPL 2025 : వామ్మో.. అదే బాదుడు భయ్యా.. 39 బంతల్లోనే సెంచరీ.. పంజాబ్ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్య ఊచకోత..
అతడి ఇన్నింగ్స్ లో 9 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయంటే.. ఏ రేంజ్ లో బ్యాట్ తో విధ్వంసం చేశాడో తెలుస్తుంది.

Courtesy @IPL BCCI
IPL 2025 : ఐపీఎల్ 2025 సీజన్ 18లో మొహాలీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య సెంచరీతో చెలరేగాడు. చెన్నై బౌలర్లను ఊచకోత కోశాడు. సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించాడు. ఆర్య ఏ రేంజ్ లో వీరవిహారం చేశాడంటే.. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ బాదాడు. తొలుత 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.
Also Read : సీఎస్‌కే వరుస ఓటములు.. ధోని, ఫ్లెమింగ్‌లకు ఓ స్పష్టమైన ప్రణాళిక లేదు..
అతడి ఇన్నింగ్స్ లో 9 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. ఓ ఎండ్ లో వికెట్లు పడుతున్నా ఆర్య మాత్రం బాదుడు ఆపలేదు. చెలరేగి ఆడుతున్న ఆర్యకు బంతి ఎక్కడ వేయాలో తెలియక సీఎస్ కే బౌలర్లు బెంబేలెత్తిపోయారు. కాగా, 103 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నూర్ అహ్మద్ బౌలింగ్ లో ఆర్య ఔటయ్యాడు.
ఈ మ్యాచ్ లో పంజాబ్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. శశాంక్ సింగ్, మార్కో జాన్ సెన్ చెలరేగారు. శశాంక్ హాప్ సెంచరీ బాదాడు. 36 బంతుల్లో 52 పరుగులు చేశాడు. జాన్సన్ 19 బంతుల్లో 34 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ముకేశ్ చౌదరి, నూర్ అహ్మద్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో గెలవాలంటే సీఎస్ కే 220 పరుగులు చేయాలి.