IPL 2025: షెఫర్డ్ ఊచకోత.. బెంగళూరు భారీ స్కోర్.. చెన్నై టార్గెట్ ఎంతంటే..

ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లి, బెతెల్ చెలరేగారు. హాఫ్ సెంచరీలతో విజృంభించారు.

IPL 2025: షెఫర్డ్ ఊచకోత.. బెంగళూరు భారీ స్కోర్.. చెన్నై టార్గెట్ ఎంతంటే..

Courtesy BCCI

Updated On : May 3, 2025 / 9:55 PM IST

IPL 2025: బెంగళూరు వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ముగిసింది. ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లి, జాకోబ్ బెతెల్ చెలరేగారు. హాఫ్ సెంచరీలతో విజృంభించారు. విరాట్ 33 బంతుల్లో 62 పరుగులు, బెతెల్ 33 బంతుల్లో 55 పరుగులు చేశారు.

Also Read: గుజరాత్‌ టైటాన్స్‌ తనను ఎందుకు వెళ్లగొట్టిందో చెప్పిన రబాడ.. బుద్ధొచ్చింది.. ఇంకెప్పుడూ అలా చేయను..

ఇక చివర్లో రొమారియో షెఫర్డ్ విధ్వంసం సృష్టించాడు. సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించాడు. 14 బంతుల్లోనే 53 పరుగులు బాదాడు. అతడి ఇన్నింగ్స్ లో 6 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. ఇక ఖలీల్ వేసిన ఒక ఓవర్ లో ఏకంగా 33 పరుగులు బాదాడు షెఫర్డ్. 19 ఓవర్ లో ఈ ఘనత సాధించాడు. ఒకే ఓవర్ లో ఇన్ని పరుగులు రావడం ఈ సీజన్ లో ఇదే తొలిసారి. సీఎస్ కే బౌలర్లలో పతిరణ 3 వికెట్లు తీశాడు. నూర్ అహ్మద్, కర్ణ్ తలో వికెట్ పడగొట్టారు.

ఈ మ్యాచ్ లో రొమారియో షెఫర్డ్ చెన్నై బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 14 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. ఇది రెండో ఫాస్టెస్ట్ 50. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి టాప్ ల్ ఉన్నాడు జైస్వాల్. ఇక KL రాహుల్, కమిన్స్ కూడా 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదారు.