IPL 2025 : బెంగళూరుకి బిగ్ షాక్ ఇచ్చిన హైదరాబాద్..

తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్ హెచ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.

IPL 2025 : బెంగళూరుకి బిగ్ షాక్ ఇచ్చిన హైదరాబాద్..

Courtesy BCCI

Updated On : May 23, 2025 / 11:52 PM IST

IPL 2025 : బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కి బిగ్ షాక్ ఇచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ఆర్ హెచ్ చేతిలో ఆర్సీబీ ఓటమి పాలైంది. 42 పరుగుల తేడాతో హైదరాబాద్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్ హెచ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. 232 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీ.. 19.5 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఓ దశలో ఆర్సీబీ గెలిచేలా కనిపించింది.

అయితే హైదరాబాద్ బౌలర్లు కమ్ బ్యాక్ చేశారు. అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టుకి విజయం అందించారు. హైదరాబాద్ బౌలర్లలో కమిన్స్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఎషాన్ మలింగా 2 వికెట్లు తీశాడు. ఉనద్కత్, హర్షల్ పటేల్, హర్ష్ దూబె, నితీశ్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీసుకున్నారు. విరాట్ కోహ్లి(43), ఫిల్ సాల్ట్ (62).. మంచి స్టార్ట్ ఇచ్చినా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు విఫలం కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు.

Also Read: ఇంగ్లండ్‌ పర్యటనలో ఈ ఇద్దరు బ్యాటర్లకు ఛాన్స్‌! ఎందుకంటే?