RCB : ఆర్‌సీబీ కప్పు కొట్టకుంటే నా భర్తకు విడాకులు ఇస్తా.. లేడీ ఫ్యాన్ శపథం.. భర్త రియాక్షన్..
ఆర్‌సీబీకీ చెందిన ఓ మహిళా అభిమాని చేసిన పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

IPL 2025 Woman Vows To Divorce Husband If RCB Doesn't Win IPL Title
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అదరగొడుతోంది. వరుస విజయాలతో ఫైనల్ దూసుకువెళ్లింది. గురువారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్ ను ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. కాగా.. ఐపీఎల్ చరిత్రలో ఆర్‌సీబీ ఫైనల్‌కు చేరుకోవడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. గత మూడు సందర్భాల్లో ఆర్‌సీబీకి నిరాశే ఎదురైంది.
కాగా.. క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఆర్‌సీబీకీ చెందిన ఓ మహిళా అభిమాని చేసిన పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ టైటిల్ గెలవకపోతే తనకు భర్తకు విడాకులు ఇస్తానని ప్రకటించింది.
GT vs MI : గుజరాత్‌తో మ్యాచ్.. ముంబైకి ఇదేం టెన్షన్ సామీ.. ఇక ఎలిమినేషనేనా?
— Ghar Ke Kalesh (@gharkekalesh) May 29, 2025
ఆర్‌సీబీ జట్టు ఫైనల్ మ్యాచ్‌లో గెలవకపోతే.. నేను నా భర్తకు విడాకులు ఇస్తాను. అంటూ ఓ మహిళా అభిమాని ఓ ఫక్లార్డ్ పట్టుకుని మైదానంలోకి వచ్చింది. మ్యాచ్ జరుగుతుండగా ఆమె దాన్ని చూపించింది. కెమెరామెన్లు ఆమె ను ఫోకస్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. దీన్ని చూసిన తరువాత సదరు భర్త రియాక్షన్ ఏంటో మరీ అని అంటున్నారు.
జూన్ 3న గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. చూడాలి మరి ఆర్‌సీబీ కప్పు కొడుతుందా? లేదో? ఆ మహిళ భర్త అదృష్టం ఎలాగ ఉందో మరి.