IPL2022 DC Vs KKR : దంచికొట్టిన ఢిల్లీ.. కోల్‌కతా ముందు భారీ లక్ష్యం
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్ జట్టు భారీ స్కోర్ చేసింది. డబుల్ సెంచరీ స్కోర్ బాదింది. ఢిల్లీ బ్యాటర్లు దంచికొట్టారు.

Ipl2022 Dc Vs Kkr
IPL2022 DC Vs KKR : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ కేపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన కోల్ కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్ జట్టు భారీ స్కోర్ చేసింది. డబుల్ సెంచరీ స్కోర్ బాదింది. ఢిల్లీ బ్యాటర్లు దంచికొట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఆ జట్టు 215 పరుగులు చేసింది. కోల్ కతా కు 216 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.
IPL2022 RCB Vs MI : చెన్నై బాటలో ముంబై.. వరుసగా 4వ పరాజయం.. బెంగళూరు హ్యాట్రిక్ గెలుపు
ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ లు హాఫ్ సెంచరీలతో మెరిశారు. పృథ్వీ షా 29 బంతుల్లో 51 పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్ 45 బంతుల్లో 61 పరుగులు చేశాడు. చివర్లో అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. అక్షర్ పటేల్ 14 బంతుల్లో 22 పరుగులు చేయగా, శార్దూల్ ఠాకూర్ 11 బంతుల్లో 29 పరుగులు చేశాడు. శార్దూల్ ఠాకూర్ మూడు సిక్సులు బాదాడు. కోల్ కతా బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రూ రసెల్ తలో వికెట్ తీశారు.
.@davidwarner31 top scored for the #DelhiCapitals and became the top performer as @DelhiCapitals posted 215/5 on the board. ? ?
A look at the summary of his innings ?
Follow the match ▶️ https://t.co/4vNW3LXMWM#TATAIPL | #KKRvDC pic.twitter.com/ICO50iHpaK
— IndianPremierLeague (@IPL) April 10, 2022
ఆరంభం నుంచే ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ దూకుడుగా ఆడారు. బౌండరీలతో అలరించారు. కెప్టెన్ రిషబ్ పంత్ (27) పరుగులు చేశాడు. లలిత్ యాదవ్ (1), రోమన్ వావెల్ (8) నిరాశ పరిచారు. ఆఖర్లో వచ్చిన అక్షర్ పటేల్ (22*), శార్దూల్ ఠాకూర్ (29*) ధాటిగా ఆడారు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.
IPL2022 SRH Vs CSK : ఎట్టకేలకు హైదరాబాద్ బోణీ.. చెన్నైకి నాలుగో పరాజయం
ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీకి బ్యాటింగ్ అప్పగించాడు. ఈ మెగా టోర్నీలో పాయింట్ల పట్టికలో మూడు విజయాలతో టాప్ స్థానంలో కొనసాగుతున్న కోల్‌కతాను.. రెండో గెలుపు కోసం ఆపసోపాలు పడుతున్న ఢిల్లీ ఏ మేరకు అడ్డుకుంటుందో చూడాలి. గత సీజన్ వరకు ఒకే జట్టుకు (ఢిల్లీకి) ఆడిన శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్.. ఈసారి మాత్రం ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు.
జట్ల వివరాలు :
కోల్‌కతా : శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్, అజింక్య రహానె, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, రస్సెల్, సునిల్ నరైన్, కమిన్స్, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రసిక్ సలామ్
దిల్లీ : రిషభ్ పంత్ (కెప్టెన్), పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, పావెల్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, ముస్తాఫిజర్ రహ్మాన్, ఖలీల్ అహ్మద్
An unbeaten 4⃣9⃣-run stand off just 2⃣0⃣ balls! ? ?
How good were these two for @DelhiCapitals! ? ?
Follow the match ▶️ https://t.co/4vNW3LXMWM#TATAIPL | #KKRvDC pic.twitter.com/UPLkwrWryr
— IndianPremierLeague (@IPL) April 10, 2022