IPL2022 RR Vs KKR : మళ్లీ శతక్కొట్టిన జోస్ బట్లర్.. కోల్‌కతా ముందు బిగ్ టార్గెట్
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ భారీ స్కోర్ నమోదు చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది.

Ipl2022 Rr Vs Kkr
IPL2022 RR Vs KKR : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా సోమవారం కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన కోల్ కతా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ భారీ స్కోర్ నమోదు చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్తాన్ ఓపెనర్ జోస్ బట్లర్ వీరవిహారం చేశాడు. సెంచరీతో కదం తొక్కాడు.
బట్లర్ 61 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 5 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. బట్లర్ సెంచరీ బాదడంతో రాజస్తాన్ జట్టు భారీ స్కోర్ చేసింది. కోల్ కతా బౌలర్లలో సునిల్ నరైన్ రెండు వికెట్లు పడగొట్టాడు. శివమ్ మావి, ప్యాట్ కమిన్స్, ఆండ్రూ రస్సెల్ తలో వికెట్ తీశారు.
కాగా, ఈ సీజన్ లో బట్లర్ కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ బట్లర్ సెంచరీ బాదాడు. 68 బంతుల్లో 100 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 5 సిక్సులు, 11 ఫోర్లు ఉన్నాయి.
రాజస్తాన్ ఓపెనర్ జోస్ బట్లర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తొలి ఓవర్ నుంచే ప్రత్యర్థిపై మెరుపు దాడికి దిగాడు. ఫలితంగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 5 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతాకు 218 పరుగుల భారీ టార్గెట్‌ను ఫిక్స్ చేసింది. బ్యాటింగ్‌లో బట్లర్‌తో పాటు కెప్టెన్ సంజూ శాంసన్ (38), దేవదత్ పడిక్కల్ (24), హెట్‌మయర్ (26*) రాణించారు. కాగా, ప్రస్తుత సీజన్‌లో ఇదే అత్యధిక టార్గెట్ కావడం విశేషం.(IPL2022 RR Vs KKR)
IPL 2022 : సన్ రైజర్స్ వరుస విక్టరీలు.. కావ్యా మారన్.. లాఫింగ్ టైమ్.. ట్విట్టర్‌లో కామెంట్లు..!
ఒకానొక దశలో రాజస్తాన్ రాయల్స్ ఇంకా ఎక్కువ స్కోరు చేసే అవకాశం ఉన్నప్పటికీ స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోయి అవకాశాన్ని మిస్ చేసుకుంది. కోల్‌కతా బౌలర్లు విజృంభించడంతో వరుసగా సంజూశాంసన్ (38), బట్లర్‌తో పాటు రియాన్ పరాగ్ (5), కరుణ్ నాయర్ (3) వికెట్లను చేజార్చుకుంది.
.@josbuttler set the stage on fire to score a superb ton & was our top performer from the first innings of the #RRvKKR clash. ? ? #TATAIPL | @rajasthanroyals
Scorecard ▶️ https://t.co/f4zhSrBNHi
A summary of his knock ? pic.twitter.com/8xYdlHSDw1
— IndianPremierLeague (@IPL) April 18, 2022
టీ20 లీగ్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ప్రతి మ్యాచ్ కూడా కీలకమే. విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకెళ్తేనే అవకాశం దక్కుతుంది. ఈ క్రమంలో రాజస్తాన్, కోల్‌కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. టాస్ నెగ్గిన కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకుని రాజస్తాన్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. కాగా, ఈ టోర్నీలో అత్యధిక పరుగుల జాబితాలో టాపర్‌గా జోస్ బట్లర్ ఉండగా, అత్యధిక వికెట్లను తీసిన బౌలర్‌గా చాహల్ ఉన్నాడు. ఓటములతో సతమతమవుతున్న కోల్ కతా మళ్లీ విజయాలబాట పట్టాలని ఆశిస్తోంది. కాగా, సునిల్ నరైన్‌కిది 150 మ్యాచ్.
BCCI: “మహిళా క్రికెట్ జట్టు కోసం మగాళ్ల డ్రెస్సులు సైజ్ చేశారు”
జట్ల వివరాలు:
రాజస్తాన్ రాయల్స్ టీమ్: సంజూ శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, దేవదుత్ పడిక్కల్, కరుణ్ నాయర్, హెట్ మైర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ, మెక్‌కాయ్, చాహల్
కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ : వెంకటేశ్ అయ్యర్, ఆరోన్ ఫించ్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీశ్ రాణా, ఆండ్రూ రస్సెల్, షెల్డన్ జాక్‌సన్, సునిల్ నరైన్, ప్యాట్ కమిన్స్, శివమ్ మావి, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
1⃣0⃣3⃣ Runs
6⃣1⃣ Balls
9⃣ Fours
5⃣ Sixes@josbuttler put on an absolute show with the bat & creamed his 2nd ? of the #TATAIPL 2022. ? ? #RRvKKR | @rajasthanroyalsWatch that outstanding knock ? ?https://t.co/XuPT1B2143
— IndianPremierLeague (@IPL) April 18, 2022