RCB : వామ్మో.. జోష్ హేజిల్‌వుడ్ మామూలోడు కాదు.. ఈ లెక్కన ఆర్‌సీబీదే ఐపీఎల్ టైటిల్..
ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీకి అన్ని శుభశకునాలే కనిపిస్తున్నాయి.

Courtesy BCCI
తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకోవాలని అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇటు పంజాబ్ కింగ్స్ ఆరాటపడుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అహ్మదాబాద్ వేదికగా జరిగే ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇక ఆర్‌సీబీ ఫ్యాన్స్ అయితే ఈ సారి కప్పు మనదే అంటూ ఇప్పటికే సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. హేజిల్‌వుడ్ తన క్రికెట్ కెరీర్‌లో ఆడిన ఏ మెగా టోర్నీ ఫైనల్‌లోనూ ఓడిపోలేదు. ఈనేపథ్యంలో నేటి ఫైనల్‌లోనూ ఆర్‌సీబీ గెలుస్తుందని చెబుతున్నారు.
ఈ సీజన్‌లో హేజిల్‌వుడ్ ఆర్‌సీబీ తరుపున 11 మ్యాచ్‌లు ఆడాడు. 8.30 ఎకానమీ, 15.80 సగటుతో 21 వికెట్లు సాధించాడు. అత్యుత్తమ ప్రదర్శన 4/33. ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
RCB : ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు శుభవార్త.. విధ్వంసకర వీరుడు వచ్చేశాడు..
లైన్ అండ్ లెంగ్త్‌తో పాటు తన పదునైన పేస్‌లో వికెట్లు పడగొట్టే హేజిల్‌వుడ్ అండర్-19 ప్రపంచకప్ నుంచి 50 ఓవర్ల వన్డే ప్రపంచకప్, ఐపీఎల్ సహా ప్రపంచ క్రికెట్‌లో అతడు ఆడిన ముఖ్యమైన ఫైనల్ మ్యాచ్‌లు అన్నింటిలో గెలుపొందాడు.
టోర్నమెంట్ ఫైనల్స్‌లో హేజిల్‌వుడ్ ప్రదర్శన, రిజల్ట్ ఇలా..
2010 U19 WC ఫైనల్ : పాకిస్థాన్‌తో జరిగిన నాటి మ్యాచ్‌లో హేజిల్‌వుడ్ ( 8.2 ఓవర్లలో 4/30) నాలుగు వికెట్లతో రాణిచాడు. దీంతో పాక్ 82 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.
2012లో ఛాంపియన్స్ లీగ్ టీ20 ఫైనల్ : సిడ్నీ సిక్సర్ తరుపున ఆడిన హేజిల్ వుడ్ నాలుగు ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. దీంతో దక్షిణాఫ్రికా టీ20 జట్టు అయిన లయన్స్ 121 పరుగులకే కుప్పకూలింది.
Rohit Sharma : మీరేంట్రా ఇలా ఉన్నారు.. రోహిత్ శర్మను దోచుకున్న ముంబై ప్లేయర్లు..!
2014 షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్ : న్యూ సౌత్ వేల్స్ (NSW) తరపున వెస్ట్ ఆస్ట్రేలియాపై 6 వికెట్లు (22 ఓవర్లలో 6/50) తీశాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి.. న్యూ సౌత్‌వేల్స్ విజేతగా నిలిచింది.
2015 ప్రపంచ కప్ ఫైనల్ : ఈ మ్యాచ్‌లో ఎనిమిది ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చాడు. అయితే.. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. అతడి కెరీర్‌లో ఒక్క వికెట్ కూడా తీయని టోర్నమెంట్ ఫైనల్స్‌లో ఇదే మొదటిది. అతడు రాణించపోయినా మిగిలిన బౌలర్లు రాణించడంతో న్యూజిలాండ్ 183 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో విజేతగా నిలిచింది.
బిగ్ బాష్ లీగ్ 2019-2020 ఫైనల్ : సిడ్నీ సిక్సర్స్ తరపున ఆడిన హేజిల్‌వుడ్ మూడు ఓవర్లు వేసి 18 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. దీంతో 117 పరుగుల లక్ష్య ఛేదనలో మెల్‌బోర్న్ స్టార్స్ 97 పరుగులకే పరిమితమైంది.
IPL 2021 ఫైనల్ : చెన్నై సూపర్ కింగ్స్ తరుపున బరిలోకి దిగిన హేజిల్‌వుడ్ నాలుగు ఓవర్లు వేసి 29 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. దీంతో 193 పరుగుల లక్ష్య ఛేదనలో కేకేఆర్ 165/9 కే పరిమితం కావడంతో సీఎస్‌కే కప్పును ముద్దాడింది.
టీ20 ప్రపంచకప్ 2021 ఫైనల్ : న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి 16 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కేన్ విలియమ్సన్ 85 పరుగులతో రాణించడంతో కివీస్ 172/4 పరుగుల స్కోరు ను సాధించింది. ఆ తరువాత మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ అర్ధ శతకాలతో చెలరేగడంతో లక్ష్యాన్ని ఆస్ట్రేలియా జట్టు ఈజీగా అందుకుంది.
RCB : ఆర్‌సీబీకి అన్నీ శుభశకునాలే.. ఈ ఒక్కటి వర్కౌట్ అయితే.. కోహ్లీ చేతిలో కప్పు..
2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ : భారత్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో హేజిల్‌వుడ్ 10 ఓవర్లు వేసి 60 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 240 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్ నరేంద్రమోదీ స్టేడియంలోనే జరగడం గమనార్హం.
పై ఏడు ఫైనల్స్ మ్యాచ్‌లు కలిపి హేజిల్‌వుడ్ 23 వికెట్లు తీశాడు. టీ20 టోర్నమెంట్ ఫైనల్స్‌ను పరిశీలిస్తే.. అతను నాలుగు ఆటలలో 7.72 సగటు, 5.66 ఎకానమీ రేటుతో 11 వికెట్లు సాధించాడు.