RCB : ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు శుభవార్త.. విధ్వంసకర వీరుడు వచ్చేశాడు..
ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీ అభిమానులు శుభవార్త అందింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్ ముగింపుకి చేరింది. మంగళవారం రాత్రి గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్ 2025 సీజన్ ముగియనుంది. ఫైనల్ మ్యాచ్‌లో కప్పు కోసం పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీపడనున్నాయి. ఈ రెండు జట్లలో ఏ జట్టూ గెలిచినా కూడా తొలిసారి కప్పును ముద్దాడతాయి.
కాగా.. ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీ అభిమానులకు శుభవార్త అందింది. ఆర్‌సీబీ స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ మంగళవారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఆడడం సందేహాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అతడు తన భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వనుండంతో స్వదేశానికి వెళ్లినట్లుగా వార్తలు వచ్చాయి. అదే సమయంలో సాల్ట్ ఆర్‌సీబీ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనకపోవడంతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఆందోళన చెందారు.
Update: Phil Salt has returned to Ahmedabad this morning after having gone home for the birth of his child #RCBvPBKS #IPL2025 pic.twitter.com/Nh9JjfAYZy
— ESPNcricinfo (@ESPNcricinfo) June 3, 2025
అయితే.. ఈ ఉదయం ఫిల్ సాల్ట్ అహ్మదాబాద్‌కు చేరుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్నిఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో తెలిపింది. దీంతో అతడు ఫైనల్ మ్యాచ్‌లో పాల్గొనడం పై ఉన్న అనిశ్చితి తొలిగిపోయింది. ఈ సీజన్‌లో ఫిల్ సాల్ట్ 12 మ్యాచ్‌ల్లో 175.90 స్ట్రైక్‌రేటుతో 387 పరుగులు చేశాడు.
Rohit Sharma : మీరేంట్రా ఇలా ఉన్నారు.. రోహిత్ శర్మను దోచుకున్న ముంబై ప్లేయర్లు..!
సాల్ట్ తిరిగి రావడంతో ఆర్‌సీబీ టైటిల్ గెలుచుకునే అవకాశాలు మెరుగు అయ్యాయి.