MS Dhoni: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ఎలా, ఎప్పుడు..
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరోషాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పేశారు. ఇకపై డిఫెండింగ్ ఛాంపియన్స్ సీఎస్కేకే కెప్టెన్ జడేజా..

Ms Dhoni
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరోషాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పేశారు. ఇకపై డిఫెండింగ్ ఛాంపియన్స్ సీఎస్కేకే కెప్టెన్ రవీంద్ర జడేజా అంటూ ప్రకటించేశారు కూడా. మార్చి 26న గ్రౌండ్ లో కోల్‌కతాతో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది ఎల్లో ఆర్మీ.
అయితే చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ధోనీ కెప్టెన్సీ వదిలేయాలని ముందుగానే ఫిక్స్ అయ్యాడు. సరైన సమయం కోసం మాత్రమే చూస్తున్నాడు. గురువారం ఉదయం ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత తన నిర్ణయాన్ని టీమ్ మీటింగ్ లో చెప్పాడు. కాకపోతే తాను ఆలోచించుకుంటున్నానని మాత్రమే అన్నాడు. ప్రస్తుతం జడేజా ఫామ్ లో ఉన్నాడని కెప్టెన్సీ చూసుకోగలడనే విశ్వాసాన్ని కనబరిచాడు’ అని చెప్పారు.
నిజానికి ధోనీ నిర్ణయంతో సీఎస్కే జట్టు సభ్యులు షాక్ అయ్యారట. ఉదయం సీఈఓకు నిర్ణయం చెప్పి.. ఇండియా సిమెంట్స్ ఛైర్మన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్ తో మాట్లాడాలని చెప్పాడు. ఉదయం 10గంటల సమయంలో ధోనీ రిక్వెస్ట్ చేయగా.. శ్రీనివాసన్ ఆఫీస్ నుంచి మధ్యాహ్నానికి ఫోన్ వచ్చింది. ముందుగా కెప్టెన్సీ వదలొద్దని చెప్పినా కాల్ కట్ చేసే సమయానికి శ్రీనివాసన్ కూడా ధోనీ నిర్ణయానికి కన్విన్స్ అయ్యారట. ఆ పది నిమిషాల్లో డిస్కషన్ లోనే చెప్పేశారన్నమాట.
Read Also : ధోనీ షాకింగ్ నిర్ణయం : చెన్నై కొత్త కెప్టెన్‌గా రవీంద్ర జడేజా
కాల్ మాట్లాడిన తర్వాత జట్టు మొత్తానికి తాను కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేసినట్లు వివరించాడు. ప్లేయర్లంతా మీట్ అవగానే రవీంద్ర జడేజాను సీఎస్కే కెప్టెన్ గా అనౌన్స్ చేశాడు.