IPL 2025: ధోనీ.. ఇకచాలు.. రిటైర్మెంట్ ఇచ్చేయ్.. ఎందుకంటే..?: గిల్‌క్రిస్ట్
సీఎస్కే ప్లేఆఫ్స్‌నకు చేరడం కష్టమే.

ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ చిట్టచివరి స్థానంలో ఉంది. మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన చెన్నై రెండింట్లో మాత్రమే గెలిచి, ఏడు మ్యాచుల్లో ఓడిపోయింది. ఇంకా ఆ జట్టు 5 మ్యాచులు ఆడాల్సి ఉంది. ఆ 5 మ్యాచులన్నింటిలోనూ గెలిస్తే ఆ జట్టు పాయింట్లు 14 అవుతాయి. అయినప్పటికీ ప్లేఆఫ్స్‌నకు చేరడం కష్టమే.
చెన్నై టీమ్‌కి ధోనీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాక కూడా ఆ జట్టు బాగా రాణించట్లేదు. ధోనీ ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు 98 బాల్స్ ఆడి, 140 రన్స్ మాత్రమే కొట్టాడు. ధోనీ ఆటతీరుపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ స్పందిస్తూ ఐపీఎల్‌కు ధోనీ ఇక రిటైర్మెంట్ ప్రకటించాలన్నారు.
Also Read: పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న జట్లను బాటమ్‌లో ఉన్న జట్లు ఓడించొచ్చు: ద్రవిడ్
ధోనీ ఇప్పటికే చాలా సాధించాడని, క్రికెట్‌లో ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదని ఆడమ్ గిల్‌క్రిస్ట్ చెప్పారు. ఇంకా ఆడాలా వద్దా? అన్నది ధోనీ ఇష్టం అయినప్పటికీ తన అభిప్రాయం ప్రకారం టీమ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుంటే ఐపీఎల్ 2026లో ధకనీ ఆడాల్సిన అవసరం లేదని అన్నాడు.
ధోనీ ఒక ఛాంపియన్ అని, ఐకాన్ అని చెప్పారు. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు చెన్నై టీమ్‌లో మార్పులు చేయాలని ఆడమ్ గిల్‌క్రిస్ట్ సూచించారు. ధోనీ, షేక్ రషీద్‌తో పాటు కాన్వే, దీపక్‌ను కూడా ఆడించొద్దని చెప్పారు.
కాగా, ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తారని ప్రతి ఐపీఎల్ సీజన్ సమయంలోనూ ప్రచారం జరుగుతుంటుంది. కానీ, ధోనీ ఆ పని చేయడు. అతడు రిటైర్మెంట్ ప్రకటించాలని కొందరు మాజీ క్రికెటర్లు సూచిస్తుంటారు.