ధోనీ.. జడేజాలకు జ్వరమొచ్చింది
అంతకుముందే చెప్పినట్లు రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీలకు వైరస్‌తో కూడిన జ్వరం రావడం ఇందుకు ప్రధాన కారణం.

అంతకుముందే చెప్పినట్లు రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీలకు వైరస్‌తో కూడిన జ్వరం రావడం ఇందుకు ప్రధాన కారణం.
చెన్నై సూపర్ కింగ్స్‌కు చేదు వార్త. ఏప్రిల్ 26 చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌కు ధోనీ.. జడేజాలు అందుబాటులో లేకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. అంతకుముందే చెప్పినట్లు రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీలకు వైరస్‌తో కూడిన జ్వరం రావడం ఇందుకు ప్రధాన కారణం.
చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లోనూ వీరిద్దరూ కనిపించకపోవడం పెద్ద లోటుగా కనిపించింది. ఫలితంగా ముంబై ఇండియన్స్ చేతిలో 46పరుగుల తేడాతో ఓటమికి గురైంది. ధోనీ లేకుండా జట్టు ఓడిపోవడం ఇది రెండోసారి. చెన్నై వేదికగా మే1న సూపర్ కింగ్స్ .. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ఆడనుంది.
ఈ మ్యాచ్ గురించి న్యూజిలాండ్ మాజీ కెప్టెన్.. చెన్నై జట్టు హెడ్ కోచ్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ‘మా తర్వాతి మ్యాచ్‌లో ఢిల్లీతో తలపడనున్నాం. దానికింకా 4రోజుల సమయం ఉంది. ముంబై ఇండియన్స్ 5రోజుల విరామం తర్వాత ఆడిన మ్యాచ్‌లో విజయాన్ని చవిచూసింది. మేం కూడా అదే ఫలితాలను ఆశిస్తున్నాం’ అని తెలిపాడు. తర్వాతి మ్యాచ్‌కైనా ధోనీ కోలుకోవాలని చెన్నై అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.