ధోనీ.. తొలి భారత క్రికెటర్ రికార్డు నీకే సొంతం

ఐపీఎల్ అంటే రికార్డులు, అద్భుతాలు సర్వ సాధారణం. ఇక చెన్నై సూపర్ కింగ్స్‌కు అయితే చెప్పే పనేలేదు.

  • Published By: veegamteam ,Published On : April 22, 2019 / 08:03 AM IST
ధోనీ.. తొలి భారత క్రికెటర్ రికార్డు నీకే సొంతం

Updated On : April 22, 2019 / 8:03 AM IST

ఐపీఎల్ అంటే రికార్డులు, అద్భుతాలు సర్వ సాధారణం. ఇక చెన్నై సూపర్ కింగ్స్‌కు అయితే చెప్పే పనేలేదు.

ఐపీఎల్ అంటే రికార్డులు, అద్భుతాలు సర్వ సాధారణం. ఇక చెన్నై సూపర్ కింగ్స్‌కు అయితే చెప్పే పనేలేదు. అలాంటిది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఒకే ఒక్క పరుగు తేడాతో ఓటమికి గురైంది. అయినప్పటికీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వీరోచిత ప్రదర్శనతో ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. 

48 బంతుల్లోనే 84 పరుగులు సాధించి జట్టుకు హైస్కోరర్‌గా నిలవడమే కాకుండా, అతని ఐపీఎల్ కెరీర్లోనే ఎప్పుడూ చేయనంత అధిక స్కోరును నమోదు చేశాడు. అంతేకాకుండా ఐపీఎల్ 12సీజన్లలో 200కు పైగా సిక్సులు బాదిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. 

ఈ జాబితాలో విధ్వంసక ప్లేయర్ క్రిస్ గేల్ 323 సిక్సులతో టాప్ లిస్ట్‌లో  ఉండగా డివిలియర్స్ 204సిక్సులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ధోనీ 203సిక్సులతో మూడో స్థానంలో ఉంటే, తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ, సురేశ్ రైనాలు 190సిక్సులతో నిలిచారు. కోహ్లీ ఖాతాలోనూ 186సిక్సులు ఉన్నాయి. 
Also Read : OMG : కరెంట్ స్తంభాన్ని గుద్దితే.. కారు రెండు ముక్కలైంది