స్వీట్ వార్నింగ్: టీమిండియా పట్ల జాగ్రత్తగా ఉండండి

స్వీట్ వార్నింగ్: టీమిండియా పట్ల జాగ్రత్తగా ఉండండి

Updated On : January 27, 2019 / 11:44 AM IST

ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా చాలా విమర్శలు తట్టుకొంది. ఆ దేశ ప్రజలు స్టేడియంలో కూర్చొని విమర్శలు చేస్తున్నా.. విమర్శలు తట్టుకుని సిరీస్‌లను దక్కించుకున్నారు. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆ దేశ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇవి మాత్రం ఆ పర్యటనలో చేసినట్లు కాకుండా సరదాగా చేసినవి. 

ఆస్ట్రేలియా పర్యటనను ద్వైపాక్షిక సిరీస్ విజయంతో పూర్తి చేసుకున్న టీమిండియా.. న్యూజిలాండ్ గడ్డపైనా అదే జోరుని కొనసాగిస్తూ వరుసగా రెండు వన్డేల్లోనూ ఘన విజయాల్ని అందుకుంది. ఏ జట్టు అయినా ఆధిపత్యం మాదేనని కొనసాగుతున్న తీరుపై సరదాగా స్పందించిన కివీస్ పోలీసులు దేశంలో పర్యటిస్తున్న భారత్ గత వారం నేపియర్, మౌంట్‌ మాంగనుయ్‌‌లో నిర్దాక్ష్యిణంగా న్యూజిలాండ్‌పై విరుచుకుపడింది.

 

కాబట్టి.. ప్రజలు ఎవరైనా బ్యాట్ లేదా బంతితో వెలుపలికి వెళ్లాలనుకుంటే అదనపు జాగ్రత్తలు తీసుకోండి.. అంటూ పోలీసులు సరదాగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో.. ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 2-0తో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. మూడో వన్డే సోమవారం ఉదయం 7.30 నుంచి జరగనుంది.