India vs Pakistan : వరల్డ్ కప్ చరిత్రలో భారత్ వర్సెస్ పాక్ మధ్య మ్యాచ్ లలో భారత్ ఎన్నిసార్లు టాస్ గెలిచిందో తెలుసా?
వరల్డ్ కప్ చరిత్రలో ఎనిమిదో సారి ఇండియా - భారత్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే, ఇప్పటి వరకు ఈ ఇరు జట్లు తలపడిన మ్యాచ్ లలో భారత్ జట్టు ఎన్నిసార్లు టాస్ గెలిచింది?

India vs Pakistan
ODI World Cup 2023 India vs Pakistan : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న సమయం రానేవచ్చింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్ – పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ ఇరు జట్లు ఇప్పటికే ఏడు సార్లు మెగా టోర్నీలో తలపడ్డాయి. అయితే, ఏడు సార్లు ఇండియానే విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఎనిమిదో సారి ఇండియా – భారత్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే, ఇప్పటి వరకు ఈ ఇరు జట్లు తలపడిన మ్యాచ్ లలో భారత్ జట్టు ఎన్నిసార్లు టాస్ గెలిచింది? ఎన్నిసార్లు తొలుత బౌలింగ్ చేసిందో ఓ సారి చూద్దాం.
మొత్తం ఎనిమిది మ్యాచ్ లలో (ప్రస్తుతం మ్యాచ్ తో కలుపుకొని) భారత్ జట్టు ఆరు సార్లు టాస్ నెగ్గగా.. పాకిస్థాన్ జట్టు రెండు సార్లు గెలిచింది. గత ఏడు మ్యాచ్ లలో ఐదు సార్లు టాస్ గెలిచిన భారత్ జట్టు అన్నిసార్లు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో భారత్ జట్టు టాస్ గెలిచినప్పటికీ తొలిసారిగా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇరు జట్ల మధ్య టాస్ వివరాలు ఇలా..
– 1992 ప్రపంచ కప్ లో భారత్ జట్టు టాస్ గెలిచింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
– 1996 ప్రపంచ కప్ లో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
– 1999 ప్రపంచకప్ లో భారత్ జట్టు మరోసారి టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
– 2003 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
– 2011 ప్రపంచ కప్ లో భారత్ టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
– 2015 ప్రపంచ కప్ లో మరోసారి భారత్ జట్టే టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
– 2019 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ జట్టు టాస్ గెలిచింది. తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
– 2023 ప్రపంచ కప్ (ప్రస్తుతం) భారత్ జట్టు టాస్ గెలిచింది. తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.