వర్షం కారణంగా మ్యాచ్‌కు ఆటంకం: భోజన విరామంలో అరగంట కోత

వర్షం కారణంగా మ్యాచ్‌కు ఆటంకం: భోజన విరామంలో అరగంట కోత

భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత్-ఆసీస్ ప్లేయర్లను వరుణుడు పరీక్షిస్తున్నాడు. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. మ్యాచ్‌కు ముందే వర్షం పడటంతో కాస్త ఆలస్యంగా ఆరంభమైంది. ఆ తర్వాత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీ ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. క్రీజులోకి వచ్చిన ఓపెనర్లు అలెక్స్ క్యారీ, ఆరోన్ ఫించ్‌లు  భువనేశ్వర్ బౌలింగ్‌లో చెరో బంతి ఆడి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశారు. 

దాదాపు పదిహేను నిమిషాలకు మించి మ్యాచ్‌కు ఆటంకం కలిగింది. మ్యాచ్ అంతరాయంతో పాటు ప్లేయర్లపై మరో ఆంక్ష పడింది. వర్షం కారణంగా వృథా అయిన సమయాన్ని భోజన విరామాన్ని 30 నిమిషాలపాటు కుదించి సర్దుబాటు చేయనున్నారు.