Ravi Shastri : ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా విజ‌య ర‌హ‌స్యాన్ని బ‌య‌ట‌పెట్టిన మాజీ కోచ్ ర‌విశాస్త్రి..!

Ravi Shastri comments : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 చివ‌రి అంకానికి చేరుకుంది. ఆదివారం జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌తో ఈ మెగాటోర్నీ ముగియ‌నుంది.

Ravi Shastri : ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా విజ‌య ర‌హ‌స్యాన్ని బ‌య‌ట‌పెట్టిన మాజీ కోచ్ ర‌విశాస్త్రి..!

Ravi Shastri comments

Updated On : November 17, 2023 / 3:48 PM IST

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 చివ‌రి అంకానికి చేరుకుంది. ఆదివారం జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌తో ఈ మెగాటోర్నీ ముగియ‌నుంది. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఆస్ట్రేలియా ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు సార్లు 1987, 1999, 2003, 2007, 2015 ల‌లో విజేత‌గా నిల‌వ‌గా భార‌త్ 1983, 2011ల‌లో గెలుపొందింది. ఈ క్ర‌మంలో ఫైన‌ల్ మ్యాచ్‌లో ఎవ‌రు విజేగా నిలుస్తారో అన్న ఆస‌క్తి ఏర్ప‌డింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఆరో సారి ప్ర‌పంచ‌క‌ప్‌ను గెల‌వాల‌ని ఆసీస్ భావిస్తుండ‌గా మూడో సారి క‌ప్పును ముద్దాడాల‌ని భార‌త్ ప‌ట్టుద‌ల‌గా ఉంది.

ఈ క్ర‌మంలో ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు ఈ మ్యాచ్‌లో ఎవ‌రు గెలుస్తారు అనే దానిపై జోస్యాలు చెబుతున్నారు. భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల‌ల‌లో ఎవ‌రు విజ‌యం సాధిస్తారు అనే ప్ర‌శ్న టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్, కామెంటేట‌ర్ రవిశాస్త్రి కి ఎదురైంది. దీనిపై ర‌విశాస్త్రి మాట్లాడుతూ.. ఖ‌చ్చితంగా భార‌త జ‌ట్టే విజ‌యం సాధిస్తుంద‌న్న ధీమాను వ్య‌క్తం చేశారు. ఈ మెగాటోర్నీలో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విజ‌యం సాధించ‌డంతో ఫైన‌ల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఫేవ‌రెట్‌గా అడుగుపెడుతుంద‌ని చెప్పారు.

India vs Australia : భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా.. 20 ఏళ్ల నాటి ప‌గ.. అప్పుడు ఏం జ‌రిగిందో తెలుసా..?

భార‌త జ‌ట్టు అద్భుతంగా ఆడుతోంద‌ని, కొత్త‌గా ఎలాంటి ప్ర‌యోగాలు చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నాడు. చివ‌రి మ్యాచుల్లో ఎలాగైతే ఆడారో అలా ఆడితే స‌రిపోతుంద‌న్నారు. కొన్ని లోపాలు ఉన్నాయ‌ని వాటిని స‌రిదిద్దుకోవాలని సూచించాడు. ఇక్క‌డ మంచి విష‌యం ఏమిటంటే.. ప్ర‌స్తుత జ‌ట్టు ఒక‌రిద్ద‌రు ఆట‌గాళ్ల పై ఆధార‌ప‌డ‌డం లేద‌న్నాడు. ఎనిమిది నుంచి తొమ్మిది మంది ఆట‌గాళ్లు నిల‌క‌డ‌గా రాణిస్తున్నార‌న్నారు. వీరంతా అద్భుత ఫామ్‌లో ఉండ‌డం కూడా క‌లిసి వ‌స్తోంద‌న్నాడు. ఇది ఓ అద్భుత సంకేతం అని ర‌విశాస్త్రి అన్నారు.

Rohit Sharma : స్కూల్ బుక్‌లో రోహిత్ శర్మ పై పాఠ్యాంశం..!