Ravindra Jadeja: జడేజా జోరు మామూలుగా లేదు.. 250 వికెట్లు, 2500 పరుగులు
Ravindra Jadeja: టెస్టులో నంబర్ వన్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా దూసుకుపోతున్నాడు.

Ravindra Jadeja: టెస్టులో నంబర్ వన్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా దూసుకుపోతున్నాడు. తాజాగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో చెలరేగి ఆడుతున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ లో సత్తా చాటుతూ టీమిండియాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ముఖ్యంగా బంతితో విజృంభిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ లో కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు.
ఆసీస్ తో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. 12.1 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 42 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు నేలకూల్చాడు. జడేజా విజృంభణతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. రెండో టెస్ట్ మ్యాచ్ లో ఓవరాల్ గా 10 వికెట్లు పడగొట్టాడు.
నాగపూర్ లో జరిగిన మొదటి టెస్టులోనూ జడేజా సత్తా చాటాడు. ఓవరాల్ గా 7 వికెట్లు తీశాడు. అటు బ్యాటింగ్ లోనూ రాణించి అర్ధసెంచరీ (70) చేశాడు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 132 పరుగులతో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
Also Read: పృథ్వీ షా ఎవరో తెలియదు.. మేము ఇద్దరే ఉన్నాం.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన సప్నా గిల్
250 వికెట్లు, 2500 పరుగులు
62వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న రవీంద్ర జడేజా మరో ఘనత సాధించాడు. 250 వికెట్లు, 2500 పరుగులు సాధించిన నాలుగో భారత ఆటగాడిగా నిలిచాడు. అశ్విన్, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్ ఇంతకుముందు ఈ ఘనత సాధించారు. భారత తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించాడు. ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఇయాన్ బోథమ్ 55 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు.