మన బ్యాట్స్ మెన్లకు ఏమైంది : 12 పరుగులకే కోహ్లీ ఔట్

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా చివరిదైన మూడో టెస్టును రాంచీ వేదికగా ఆడుతున్నారు. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకోగా టాపార్డర్ పేలవమైన ప్రదర్శన కనబరుస్తోంది. తొలి రెండు టెస్టుల్లోనూ మొదటి ఇన్నింగ్స్ లోనే భారీ స్కోరు బాదేసిన టీమిండియా స్వల్పమైన స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది.
జార్ఖండ్ డైనమేట్.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సొంత మైదానంలో ముఖ్య అతిథిగా హాజరైన మ్యాచ్ కు విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ స్టార్ బ్యాట్స్ మెన్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. పూజార్ డకౌట్ అవగా మయాంక్ అగర్వాల్(10), విరాట్ కోహ్లీ(12) పరుగులతో సరిపెట్టుకున్నారు.
ఓపెనర్ రోహిత్ శర్మ ఒంటరిపోరాటానికి రహానె చక్కటి సహకరారం అందిస్తున్నాడు. సౌతాఫ్రికా బౌలర్లు రబాడ 2, ఎన్రిచ్ 1వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో 33 ఓవర్లు ముగిసేసరికి రోహిత్ శర్మ(52; 8ఫోర్లు, 1సిక్సు), రహానె(43; 7ఫోర్లు)తో క్రీజులో ఉన్నారు.