పంత్ డీఆర్ఎస్‌కు రోహిత్ మొహం మాడిపోయింది
క్యాచ్ అందుకున్న పంత్ బంతి బ్యాట్ ఎడ్జ్ తాకిందని భ్రమించాడు. అంపైర్ అవుట్ అని ప్రకటించడం లేదని గ్రహించి రివ్యూకు వెళ్లిపోయాడు. థర్డ్ అంపైర్ చూపించిన రివ్యూలో..

క్యాచ్ అందుకున్న పంత్ బంతి బ్యాట్ ఎడ్జ్ తాకిందని భ్రమించాడు. అంపైర్ అవుట్ అని ప్రకటించడం లేదని గ్రహించి రివ్యూకు వెళ్లిపోయాడు. థర్డ్ అంపైర్ చూపించిన రివ్యూలో..
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన తొలి టీ20ని టీమిండియా అన్ని విభాగాల్లో విఫలమై చేజార్చుకుంది. పేలవమైన ఫీల్డింగ్‌తో పాటు క్యాచ్‌లు చేజార్చుకోవడం, డీఆర్ఎస్ రివ్యూల్లోని తప్పిదాల కారణంగా బంగ్లాదేశ్ చేతిలో గెలవడం భారత్ కు సంక్లిష్టంగా మార్చుకుంది. ఫలితంగా బంగ్లాదేశ్ మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యాన్ని దక్కించుకుంది.
ఈ క్రమంలో ఆదివారం మ్యాచ్ లో పంత్ చేసిన పనికి రోహిత్ తిట్టలేక నవ్వలేక మొహం తేలేశాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 149పరుగుల లక్షాన్ని నిర్దేశించింది. లక్ష్య చేధనలో భాగంగా బంగ్లా దూకుడు ఆడుతున్న తరుణంలో పదో ఓవర్ చివరి బంతికి వికెట్ కపీర్ రిషబ్ పంత్ అవుట్ అంటూ డీఆర్ఎస్ కోరాడు.
క్యాచ్ అందుకున్న పంత్ బంతి బ్యాట్ ఎడ్జ్ తాకిందని భ్రమించాడు. అంపైర్ అవుట్ అని ప్రకటించడం లేదని గ్రహించి రివ్యూకు వెళ్లిపోయాడు. థర్డ్ అంపైర్ చూపించిన రివ్యూలో అది నాటౌట్ గా తేలడంతో మొహం దాచుకున్నాడు. తాత్కాలిక కెప్టెన్ గా జట్టు బాధ్యతలు మోస్తున్న రోహిత్ శర్మ.. పంత్ ను సమీపిస్తూ నవ్వలేక ఏడవలేక అన్నట్లు ఎక్స్‌ప్రెషన్లతో కనిపించాడు.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. ‘మనం కచ్చితంగా లేనప్పుడు బౌలర్, కీపర్లను గుడ్డిగా నమ్మాల్సిందే. పంత్ మొత్తం మీద 10-12టీ20లు మాత్రమే ఆడాడు. తనకు ఇంకా అనుభవం కావాలి. ఇటువంటివి అర్థం చేసుకోవడానికి పంత్‌కు సమయం పడుతుంది అనుకుంటున్నాను’ అని వెల్లడించాడు.
— Jagadhish D (@MSdhoni7788) November 3, 2019