IPL 2021: విధ్వంసం అంటే ఇదే.. 10 వికెట్ల తేడాతో విజయం

ఐపీఎల్ టైటిల్ ను ఈ సారి ఎలాగైనా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. గత సీజన్లలో పేలవ ప్రదర్శన కనబర్చిన ఈ జట్టు.. 2021 లో మాత్రం వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది. ఆడిన 4 మ్యాచ్ లలో గణ విజయం సాధించి టాప్ ప్లేస్ లో నిలిచింది.

IPL 2021: విధ్వంసం అంటే ఇదే.. 10 వికెట్ల తేడాతో విజయం

Royal Challengers Bangalore Win The Match

Updated On : April 23, 2021 / 7:38 AM IST

IPL 2021: ఐపీఎల్ టైటిల్ ను ఈ సారి ఎలాగైనా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. గత సీజన్లలో పేలవ ప్రదర్శన కనబర్చిన ఈ జట్టు.. 2021 లో మాత్రం వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది. ఆడిన 4 మ్యాచ్ లలో గణ విజయం సాధించి టాప్ ప్లేస్ లో నిలిచింది.

ఇక గురువారం రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబరిచారు బెంగళూరు ఆటగాళ్లు.. సిరాజ్, హర్షల్ పటేల్ బంతితో మెరిపించగా.. ఓపెనర్ దేవ్ దత్ పడిక్కల్ రాజస్తాన్ రాయల్స్ బౌలర్లను చితక్కొట్టి తన ఖాతాలో మొదటి శతకాన్ని జమచేసుకున్నాడు. దేవ్‌దత్‌కు కెప్టెన్‌ కోహ్లి అండగా నిలువడంతో బెంగళూరు వికెట్‌ నష్టపోకుండానే లక్ష్యాన్ని ఛేదించి రాజస్తాన్‌ రాయల్స్‌ను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్ల దాటికి కష్టాల్లో పడిన రాజస్తాన్ ను శివమ్ దూబే, రాహుల్ తెవాటియా ఆదుకున్నారు. శివన్ 32 బంతుల్లో 46 పరుగులు చెయ్యగా, తెవాటియా 23 బంతుల్లో 40 పరుగులు చేశాడు. తమ వీరోచిత పోరాటంతో జట్టుకు భారీ స్కోరును అందించారు. మరో బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ మూడు వికెట్లు తీశాడు.

ఇక బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు వికెట్ కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్తాన్ చెమటోడ్చి చేసిన పరుగులను బెంగళూరు ఆడుతూ పడుతూ ఛేదించింది. 178 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు ఓపెనర్లు కోహ్లీ, పడిక్కల్ ఏ మాత్రం తడబడలేదు. ఓ సిక్స్ తో కెప్టెన్ కోహ్లీ స్కోర్ బోర్డ్ తెరిచాడు. ఆ తర్వాత ఇద్దరు వారి విశ్వరూపం చూపించారు. పడిక్కల్ సిక్సులు, ఫోర్లతో రెచ్చిపోయాడు. కొడితే సిక్స్, లేదంటే ఫోర్ అన్నట్లు సాగింది మ్యాచ్. 9 ఓవర్లకే వికెట్ నష్టపోకుండా 107 పరుగులు చేశారు.

ఇదే సమయంలో పడిక్కల్ 27 బంతుల్లో తన అర్ధశతకం పూర్తి చేశాడు. ఇక ఆ తర్వాత కోహ్లీ తన బ్యాట్ కు పనిచెప్పాడు. పడిక్కల్ లా దూకుడుగా ఆడకపోయినా టైమింగ్ తో ఆడి 34 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు కోహ్లీ. ఆ తర్వాత కోహ్లీ పడిక్కల్ బాగా సహకరించాడు. అతడినే ఎక్కువగా స్ట్రైక్ లో ఉంచాడు. దీంతో దూకుడుగా ఆడిన పడిక్కల్ 51 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్ ఇతడు మొదటి సెంచరీ సాధించాడు. ఇద్దరి మెరుపు దాడితో రాజస్తాన్ ఉంచిన లక్ష్యాన్ని 17 ఓవర్లలోనే ఛేదించారు.