RRvsDC: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

RRvsDC: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

Updated On : April 22, 2019 / 2:00 PM IST

రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ ఏప్రిల్ 22న తలపడేందుకు సిద్ధమైయ్యాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. 2019 లీగ్‌లో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న స్మిత్‌కు కెప్టెన్‌గా ఇది రెండో మ్యాచ్. 

స్మిత్.. తొలి మ్యాచ్‌ను విజయంతో ఆరంభించడంతో రాజస్థాన్ జట్టులో మళ్లీ ప్లే ఆఫ్ ఆశలు చిగురించాయి. మరోవైపు ఇటీవల ముగిసిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను 2బంతులు మిగిలి ఉండగానే ఘోరంగా ఓడించింది. 

రాజస్థాన్ రాయల్స్: 
సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్, అజింకా రహానె, బెన్ స్టోక్స్, రియాన్ పరాగ్, ఆష్టన్ టర్నర్, స్టువర్ట్ బిన్నీ, శ్రేయాస్ గోపాల్, జోఫ్రా ఆర్చర్, జయదేవ్ ఉనదక్త్, ధావల్ కుల్‌కర్ణి

ఢిల్లీ క్యాపిటల్స్:
పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కొలిన్ ఇన్‌గ్రామ్, క్రిస్ మోరిస్, రూథర్‌ఫర్డ్, అక్సర్ పటేల్, కగిసో రబాడ, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ