RRvsSRH: రాజస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిన హైదరాబాద్

RRvsSRH: రాజస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిన హైదరాబాద్

Updated On : April 27, 2019 / 6:26 PM IST

రాజస్థాన్ చేతిలో హైదరాబాద్ కు ఓటమి తప్పలేదు. 161పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ చక్కటి ప్రదర్శన చేయగలిగింది. బ్యాట్స్‌మెన్ అజింకా రహానె(39), లియామ్ లివింగ్  స్టోన్(44), సంజూ శాంసన్(48), స్టీవ్ స్మిత్(22), ఆష్టన్ టర్నర్(3)పరుగులు చేయడంతో టార్గెట్ సునాయాసంగా చేధించగలిగారు.

ఆరంభం నుంచి ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్ చేతిలో ఓడిపోయింది రైజర్స్. హైదరాబాద్ బౌలింగ్ విభాగం మరోసారి నిరాశ పరచడంతో.. స్టీవ్ స్మిత్ కెప్టెన్సీకి బలం చేకూరింది. 

హైదరాబాద్ బౌలర్లు షకీబ్ అల్ హసన్, రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు. 

అంతకంటే ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 8వికెట్లు పడగొట్టి 160పరుగులకే కట్టడి చేయగలిగింది రాజస్థాన్. హైదరాబాద్ మనీశ్ పాండే(61; 36బంతుల్లో 9ఫోర్లు) బాది జట్టులో హైస్కోరర్ గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో వరుణ్ ఆరోన్, ఒషానె థామస్, శ్రేయాస్ గోపాల్, జయదేశ్ ఉన్దక్త్ తలో 2వికెట్లు పడగొట్టారు.