Sanju Samson : భారత టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. సంజూ శాంసన్ చెత్త రికార్డు..
ఈ క్రమంలో ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు సంజూ శాంసన్.

Sanju Samson creates Unwanted Record Becomes first indian history
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ రెండో టీ20లో డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో మూడు బంతులను ఎదుర్కొన్న శాంసన్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతర్జాతీయ టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు డకౌటైన టీమ్ఇండియా ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ ఏడాది టీ20ల్లో శాంసన్ డకౌట్ కావడం ఇది నాలుగో సారి. జనవరిలో బెంగళూరు వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌తో పాటు జూలైలో పల్లెకలె వేదికగా జరిగిన శ్రీలంకతో జరిగిన వరుస టీ20ల్లో పరుగుల ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ తో కలుకుంటే నాలుగోది.
ఈ చెత్త రికార్డులో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యూసఫ్ ఫఠాన్‌లు సైతం ఉన్నారు. వీరు తలా ఓ మూడు సార్లు డకౌట్ అయ్యారు.
ఓ క్యాలెండర్ ఇయర్ అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ఆటగాళ్లు..
సంజూ శాంసన్ – 4 సార్లు (2024లో)
యూసఫ్ పఠాన్ – 3 సార్లు (2009లో)
రోహిత్ శర్మ – 3 సార్లు (2018లో)
రోహిత్ శర్మ – 3 సార్లు (2022లో)
విరాట్ కోహ్లీ – 3 సార్లు (2024లో)
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్య (45 బంతుల్లో 39 నాటౌట్ ) ఫర్వాలేదనిపించాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సఫారీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్ (41 బంతుల్లో 47 నాటౌట్) రాణించాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీశాడు.