వన్డేల్లో 100వికెట్లు కొట్టేసిన షమీ
టీమిండియా పేసర్ షమీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.వన్డే ఫార్మాట్లో 100 వికెట్లు తీసి సెంచరీ మార్కు కొట్టేశాడు. ఐదువన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో షమీ ఈ ఘనతను అందుకున్నాడు. మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే కివీస్‌ను షమీ గట్టి దెబ్బతీశాడు. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్(5), కొలిన్ మున్రో(8)లను వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చిన షమీ.. తన ఖాతాలో 100 వన్డే వికెట్లను పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో అతి వేగంగా 100 వికెట్లు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు.
56 వన్డేల్లోనే షమీ ఈ ఘనతను అందుకుని ఇర్ఫాన్ పఠాన్ (59 వన్డేలు)రికార్డును దాటేశాడు. గతంలో భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ (65 వన్డేలు), సీనియర్ క్రికెటర్లు అజిత్ అగార్కర్ 67 వన్డేల్లో, జవగల్ శ్రీనాథ్ (68 వన్డేల్లో)లోనే 100వికెట్ల మార్కును అందుకున్నారు.
100వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే:
మొహమ్మద్ షమీ 56(మ్యాచ్‌లు)
ఇర్ఫాన్ పఠాన్ 59(మ్యాచ్‌లు)
జహీర్ ఖాన్ 65(మ్యాచ్‌లు)
అజిత్ అగార్కర్ 67(మ్యాచ్‌లు)
జవగల్ శ్రీనాథ్ 68(మ్యాచ్‌లు)