సోదరా..! కెమెరాలో రుతురాజ్ గైక్వాడ్ ముఖాన్ని కూడా చూపించు .. అతనే కెప్టెన్

నూతన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో సీఎస్కే జట్టు ఆరు వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని సాధించింది.

సోదరా..! కెమెరాలో రుతురాజ్ గైక్వాడ్ ముఖాన్ని కూడా చూపించు .. అతనే కెప్టెన్

Virender Sehwag

Virender Sehwag : ఐపీఎల్ 2024 టోర్నీ శుక్రవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడ్డాయి. నూతన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో సీఎస్కే జట్టు ఆరు వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని సాధించింది. తన కెప్టెన్సీలో తొలి మ్యాచ్ లోనే జట్టును విజయవంతంగా విజయతీరాలకు నడిపించడం పట్ల రుతురాజ్ గైక్వాడ్ పై పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. అయితే, టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం రుతురాజ్ కెప్టెన్సీపై తనదైన శైలిలో చమత్కరించారు.

Also Read : IPL 2024 : ఐపీఎల్ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ

సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్ లో భాగంగా రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నైసూపర్ కింగ్స్ జట్టు తొలుత ఫీల్డింగ్ చేసింది. ఆ సమయంలో వీరేంద్ర సెహ్వాగ్ జియో సినిమా లో కామెంటేటర్ గా ఉన్నాడు. కెమెరామెన్ కెప్టెన్సీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ వైపు కాకుండా మహేంద్ర సింగ్ ధోనీ వైపు తరచూ చూపిస్తున్నాడు. ఈ క్రమంలో ధోనీ ఫీల్డింగ్ సెట్ చేసే దృశ్యాలు హైలెట్ అయ్యాయి. వీరేంద్ర సెహ్వాగ్ కెమెరామెన్ ను ఉద్దేశిస్తూ.. బ్రదర్.. దయచేసి కెమెరాలో రుతురాజ్ ముఖాన్ని కూడా చూపించండి.. ఎందుకంటే అతనే సీఎస్కే జట్టు కెప్టెన్. మీరు ధోనీ ముఖాన్ని మాత్రమే చూపిస్తున్నారంటూ నువ్వుతూ వ్యాఖ్యానించాడు.

Also Read : IPL 2024 : పది బంతుల్లోనే ఆర్సీబీని దెబ్బతీసిన బంగ్లాదేశ్ పేసర్.. మొన్న అలా.. నేడు ఇలా..! ఫొటోలు వైరల్

రుతురాజ్ కెప్టెన్సీని పలువురు క్రీడా ప్రముఖులు ప్రశంసించారు. మాజీ టీమిండియా ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ తన ఎక్స్ ఖాతాలో.. మొదటి 26 బంతుల తరువాత సీఎస్కే జట్టు అద్భుతమైన ప్రతిభను కనబర్చింది. ఒత్తిడిలోనూ రుతురాజ్ బౌలింగ్ మార్పులు ఆకట్టుకున్నాయి అంటూ ఇర్ఫాన్ అన్నారు.