Shubman Gill : శుభ్‌మన్ గిల్ ప్రపంచ రికార్డు.. 52 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు..
వన్డేల్లో శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్లో అత్యంత వేగంగా రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్న మొదటి ఆటగాడిగా నిలిచాడు.

Shubman Gill sets new world record
Shubman Gill World Record : వన్డేల్లో శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్లో అత్యంత వేగంగా రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్న మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టడంతో అతడు ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గిల్ మొత్తంగా 31 బంతులను ఎదుర్కొని 5 ఫోర్లతో 26 పరుగులు సాధించాడు.
శుభ్‌మన్ గిల్ 38 ఇన్నింగ్స్‌ల్లో రెండు వేల పరుగులను పూర్తి చేయగా, ఈ ఘనతను అందుకోవడానికి హషీమ్ ఆమ్లాకు 40 ఇన్నింగ్స్‌లు అవసరం అయ్యాయి. వీరిద్దరి తరువాతి స్థానంలో పాకిస్తాన్ లెజెండ్ జహీర్ అబ్బాస్ ఉన్నాడు. అబ్బాస్ 45 ఇన్నింగ్స్‌ల్లో వన్డేల్లో రెండు వేల పరుగులను సాధించాడు.
వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు సాధించిన ఆటగాళ్లు (తక్కువ ఇన్నింగ్స్‌ల్లో)
శుభమన్ గిల్ (భారత్) – 38 ఇన్నింగ్స్‌ల్లో
హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా) – 40 ఇన్నింగ్స్‌ల్లో
జహీర్ అబ్బాస్ (పాకిస్థాన్) – 45 ఇన్నింగ్స్‌ల్లో
కెవిన్ పీటర్సన్ (ఇంగ్లాండ్) – 45 ఇన్నింగ్స్‌ల్లో
బాబర్ ఆజం (పాకిస్థాన్) – 45 ఇన్నింగ్స్‌ల్లో
రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (దక్షిణాప్రికా) – 45 ఇన్నింగ్స్‌ల్లో
? RECORD ALERT ?
?? star Shubman Gill becomes the fastest batter to 2000 Men’s ODI runs!#INDvNZ #CWC23 pic.twitter.com/Y9HOj7pZ38
— ICC (@ICC) October 22, 2023
ధావన్ రికార్డు బద్దలు..
టీమ్ఇండియా తరుపున వన్డేల్లో రెండు పరుగులు అత్యంత వేగంగా చేసిన రికార్డు ఇప్పటి వరకు శిఖర్ ధావన్ పేరిట ఉండేది. ధావన్ 49 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా తాజాగా గిల్ అతడి రికార్డును బద్దలు కొట్టాడు. వీరిద్దరి తరువాత నవ్యజ్యోత్ సింగ్ సిద్ధూ, సౌరవ్ గంగూలీలు చెరో 52 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకున్నారు. పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ వన్డేల్లో రెండు వేల పరుగులు పూర్తి చేసేందుకు 53 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.
భారత్ తరుపున వన్డేల్లో వేగవంతంగా రెండు వేల పరుగులు చేసిన ఆటగాళ్లు..
శుభమన్ గిల్ – 38 ఇన్నింగ్స్‌ల్లో
నవ్యజ్యోత్ సింగ్ సిద్ధూ – 52 ఇన్నింగ్స్‌ల్లో
సౌరవ్ గంగూలీ – 52 ఇన్నింగ్స్‌ల్లో
విరాట్ కోహ్లీ – 53 ఇన్నింగ్స్‌ల్లో
Mohammed Shami : చరిత్ర సృష్టించిన షమీ.. ఒకే ఒక్క భారతీయుడు.. దరిదాపుల్లో ఎవరూ లేరు
శుభ్‌మన్ గిల్ ఇప్పటి వరకు వన్డేల్లో 38 ఇన్నింగ్స్‌ల్లో 64 సగటుతో 2012 పరుగులు చేశాడు. ఇందులో 6 శతకాలు, 10 అర్ధశతకాలు ఉన్నాయి.