ఇకనైనా మేలుకోండి: కోహ్లీకి చురకలంటించిన గంగూలీ

ఇకనైనా మేలుకోండి: కోహ్లీకి చురకలంటించిన గంగూలీ

Updated On : March 15, 2019 / 9:49 AM IST

భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సిరీస్ విజయంతో వెనుదిరిగింది. విదేశాల్లో విజయాలు దక్కించుకున్న టీమిండియా సొంతగడ్డపై చేతులెత్తేసింది. ఈ ప్రదర్శన పట్ల టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అసంతృప్తి వ్యక్తపరిచాడు. ఇది ముమ్మాటికీ కెప్టెన్ కోహ్లీ తప్పేనంటూ పరోక్షంగా విమర్శించాడు. 
Read Also: PubG ఫ్యాన్స్ రిలాక్స్: గేమ్ బ్యాన్ చేయడం అంత ఈజీ కాదు!

‘ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడానికి కారణం.. జట్టులో ప్రయోగాలు ఎక్కువగా చేయడమే. ఆస్ట్రేలియా జట్టు బాగా ఆడింది. వరల్డ్ కప్ కు ముందు భారత్ ఇలా ఓడిపోవడం అస్సలు బాగోలేదు. వరల్డ్ కప్‌కు ఇంకా సమయం ఉంది. కాబట్టి మరోసారి ఇలా జరగదని ఆశిస్తున్నాను. గతంలో 2 ఆస్ట్రేలియా జట్లు భారత్‌కు వచ్చి.. విజయం దక్కించుకున్న కాలం నాకు గుర్తుకువస్తుంది’ అని వ్యాఖ్యానించాడు. 

రెండు టీ20లు, ఐదు వన్డేలు ఆడేందుకు భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా 2 టీ20ల్లో.. 3వన్డేల్లో గెలిచి విజయంతో వెనుదిరిగింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన నిర్ణయాత్మక ఐదో వన్డేలో ఆస్ట్రేలియా సిరీస్ విజేతగా నిలిచింది. మూడు వన్డేలకు ఒకే జట్టుతో బరిలోకి దిగిన టీమిండియా.. నాలుగో వన్డేలో ధోనీకి బదులుగా రిషబ్ పంత్.. ఐదో వన్డేలో మొహమ్మద్ షమీ, రవీంద్ర జడేజాలతో ఆడి ప్రయోగాలు చేసింది. 
Read Also: మన బడ్జెట్ లో : రూ.10వేల లోపు.. టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే..