Wrestling Federation Suspension : పంతం నెగ్గించుకున్న రెజ్లర్లు.. డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌కు చెక్
రెజ్లర్లు పంతం నెగ్గించుకున్నారు.. ఆటలో ఉడుంపట్టు పట్టి పతకం సాధించినట్లు.. భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI)పై సాగిస్తున్న పోరాటంలోనూ తమ మాటే నెగ్గించుకున్నారు.

Sports Ministry Suspend WFI Newly Elected Body
Sports Ministry Suspend WFI Newly Elected Body : రెజ్లర్లు పంతం నెగ్గించుకున్నారు.. ఆటలో ఉడుంపట్టు పట్టి పతకం సాధించినట్లు.. భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI)పై సాగిస్తున్న పోరాటంలోనూ తమ మాటే నెగ్గించుకున్నారు. తమ అభిష్టానికి భిన్నంగా ఎన్నికైన రెజ్లింగ్ సమాఖ్య కొత్త ప్యానెల్‌కు చెక్ చెప్పారు. క్రీడాకారులు వ్యతిరేకిస్తున్నా.. అంగ, అర్ధ, రాజకీయ బలాలతో WFIలో పాతుకుపోయిన బ్రిజ్‌భూషణ్ హవాను నిలువరించారు. రెజ్లర్లు వర్సెస్ బ్రిజ్‌భూషణ్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో చివరికి కేంద్రం అండతో రెజ్లర్లే విజేతలుగా నిలిచారు.
Also Read : WFI President Suspended: కేంద్ర క్రీడాశాఖ సంచలన నిర్ణయం.. డబ్ల్యూఎఫ్ఐ నూతన ప్యానెల్ రద్దు.. ఎందుకంటే?
క్రీడా మంత్రిత్వ శాఖ కఠిన నిర్ణయం..
భారత రెజ్లింగ్ సమాఖ్య – WFIపై కేంద్రం కఠిన వైఖరి ప్రదర్శిస్తోంది. WFI వర్సెస్ రెజ్లర్ల మధ్య సాగుతున్న పోరు.. కేంద్రం జోక్యంతో నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. ఎవరేమనుకున్నాWFIలో తనమాటే చెల్లుబాటు కావాలనుకున్న మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌కు కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ చెక్ చెప్పింది. ఈనెల 21న జరిగిన ఎన్నికల్లో కొత్తగా గెలిచిన సంజయ్ సింగ్ ప్యానెల్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు వెలువరించింది. ఇది ఓ విధంగా బ్రిజ్‌భూషణ్‌కి చెక్ చెప్పడమేనని చెప్పొచ్చు. దాదాపు పుష్కర కాలంగా WFI అధ్యక్షుడిగా కొనసాగిన బ్రిజ్‌భూషణ్ గత ఏడాది తన పదవి కోల్పోయారు. బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్‌భూషణ్ తమను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగొట్, సాక్షి మాలిక్‌తోపాటు ఏడుగురు మహిళా రెజ్లర్లు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దేశవ్యాప్తంగా దుమారం రేగింది. బ్రిజ్‌భూషణ్‌పై యాక్షన్ తీసుకోవాలని రెజ్లర్లు ఉడుంపట్టు పట్టారు. ఎన్నో రకాలుగా పోరాటాలు చేశారు. పంతం నెగ్గించుకుని ఈ నెల 21న సమాఖ్య నూతన పాలక వర్గం ఎన్నికల జరిగేలా చేశారు.
Also Read : WFI: డబ్ల్యూఎఫ్ఐ కొత్త చీఫ్‌గా సంజయ్.. తట్టుకోలేక ఏడుస్తూ వెళ్లిపోయిన మహిళా రెజ్లర్.. వీడియో
బ్రిజ్‌భూషణ్ చాణక్యం.. రెజ్లర్లు షాకింగ్ నిర్ణయాలు..
కుస్తీయోధులు పట్టు వీడని పోరాటంతో జరిగిన ఎన్నికల్లో మళ్లీ తన పవర్ చూపించాడు మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్.. తన స్థానంలో తన ప్రధాన అనుచరుడు, యూపీ రెజ్లింగ్ సమాఖ్య ఉపాధ్యక్షుడు సంజయ్ సింగ్‌ను డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేలా తెరవెనుక పావులు కదిపి బ్రిజ్‌భూషణ్ సక్సెస్ అయ్యాడు. బ్రిజ్‌భూషణ్ చాణక్యంతో రెజ్లర్లు కంగుతిన్నారు. మార్పు వస్తుందని ఆశిస్తే.. పాత సీసాలో కొత్త సారాలా డమ్మీ అధ్యక్షుడితో పాత ప్యానెలే కొలువు దీరడంతో షాక్ తిన్నారు. మరో గత్యంతరంలేక ఒలింపిక్ విజేత సాక్షి మాలిక్ రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. సాక్షి ప్రకటన ప్రకంపనలు రేపగా… స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా కూడా బ్రిజ్‌భూషణ్ పెత్తనం భరించలేమని.. రెజ్లింగ్ సమాఖ్యను ప్రక్షాళించాలనే తమ డిమాండ్ నెరవేరే పరిస్థితి లేదనే ఆవేదనతో తన ఆటకు గుర్తింపుగా వచ్చిన పద్మశ్రీ అవార్డును కేంద్రానికి తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు.
స్టార్ రెజ్లర్లు ఇద్దరూ షాకింగ్ నిర్ణయం తీసుకోవడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఇదే సమయంలో వీరికి మద్దతుగా బధిరుల ఒలింపిక్స్- డిప్లింపిక్స్‌లో పసిడి విజేత వీరేంద్రసింగ్ యాదవ్ కూడా పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించి మరింత హీట్ పెంచాడు. ఇలా డబ్ల్యూఎఫ్ఐకి ఎన్నికలు జరిగిన రెండు రోజులకే పెద్ద ఎత్తున దుమారం రేగుతుండటంతో కేంద్రం కొరడా ఝులిపించాల్సివచ్చింది.
Also Read : Mamata Banerjee : మమతా బెనర్జీ మా శాంతా క్లాజ్ : బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ వ్యాఖ్యలు
క్రీడాశాఖకు అస్త్రంగా డబ్ల్యూఎఫ్ఐ చర్యలు..
గతంలో బ్రిజ్‌భూషణ్‌పై ఉదాశీనంగా వ్యవహరించిందని విమర్శలు ఎదుర్కొన్న కేంద్ర ప్రభుత్వం ఈ సారి మాత్రం చాలా వేగంగా పావులు కదిపింది. డబ్ల్యూఎఫ్ఐ నూతన ప్యానెల్‌పై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో వేటు వేయాలని నిర్ణయించింది. దీనికి డబ్ల్యూఎఫ్ఐ తొందరపాటు చర్యలు క్రీడాశాఖకు అస్త్రంగా పనికొచ్చింది. కొత్త ప్యానెల్ ఎన్నికైన వెంటనే క్రీడాకారులకు సమయం ఇవ్వకుండా ఈ నెలాఖరులోగా అండర్-20 నేషనల్స్ నిర్వహణకు ప్రకటన ఇవ్వడంతో నిబంధనలు అతిక్రమించిందనే కారణం చూపి కేంద్రం కొత్త కమిటీని సస్పెండ్ చేసింది. బ్రిజ్‌భూషణ్ తమ పార్టీ వాడైనా.. ఈ విషయంలో ఉపేక్షిస్తే ఎన్నికల్లో దెబ్బతింటామనే ఆలోచనతో వేటు వేయడంలో కేంద్రం ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. గత ఏడాది బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు జరిపిన పోరాటంలో… మల్లయోధులకు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. ఇప్పుడు కూడా రెజ్లర్లు మళ్లీ పోరాటానికి దిగితే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయనే ఆలోచనతో కేంద్రం వాయువేగంతో యాక్షన్‌లోకి దిగింది. ఉత్తరప్రదేశ్‌లో బలమైన నేపథ్యం ఉన్నా.. బ్రిజ్‌భూషణ్‌ను కట్టడి చేయడానికే కేంద్రం మొగ్గుచూపింది.