KKR vs SRH IPL 2021: కోల్‌కత్తా భారీ స్కోరు.. చివర్లో కట్టడి చేసిన హైదరాబాద్

KKR vs SRH IPL 2021: కోల్‌కత్తా భారీ స్కోరు.. చివర్లో కట్టడి చేసిన హైదరాబాద్

Srh Vs Kkr Ipl 2021 Nitish Rana Rahul Tripathi Fifties Help Kolkata Knight Riders To 187

Updated On : April 11, 2021 / 9:47 PM IST

SRH vs KKR: ఐపీఎల్ 2021లో చెన్నై వేదికగా మెుదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మన్ మొదట్లో చెలరేగి ఆడగా.. చివర్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కోల్‌కత్తా బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేశారు. ముందుగా టాస్ గెలచిన హైదరాబాద్ ఫీల్డీండ్ ఎంచుకుని కోల్‌కత్తాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కత్తా.. నిర్ణీత 20ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 187పరుగులు చేసింది.

నితిశ్ రాణా(80), రాహుల్ త్రిపాఠి(53) రాణించగా.. 187పరుగుల భారీ టార్గెట్‌ను సన్‌రైజర్స్ ముందు ఉంచింది. అయితే వరుస ఓవర్లలో కీలక వికెట్లు కోల్పోగా.. భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు కోల్‌కత్తా ఆటగాళ్లు.  కేకేఆర్ 15 ఓవర్లలోనే 145 పరుగుల భారీ స్కోరు చేయగా.. తర్వాతి ఓవర్లోనే రాహుల్ త్రిపాఠిని సన్‌రైజర్స్ పేసర్ నటరాజన్ అవుట్ చేయడం.. తర్వాత ఆండ్రూ రస్సెల్(5), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(2) రెండంకెల స్కోరు కూడా చేయకుండా పెవిలియన్ చేరారు.

దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్ 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. చివర్లో దినేశ్‌ కార్తీక్‌(22) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. హైదరాబాద్‌ బౌలర్లలో నబీ, రషీద్‌ ఖాన్‌ చెరో రెండు వికెట్లు తీశారు. నటరాజన్‌, భువనేశ్వర్‌ చెరొక వికెట్ పడగొట్టారు. తర్వాత 188 పరుగుల లక్ష్యంతో సన్‌ రైజర్స్ బరిలోకి దిగింది.

Shakib comes into the attack and strikes straight away.

Saha departs for 7.

Live – https://t.co/yqAwBPCpkb #VIVOIPL #SRHvKKR pic.twitter.com/0LKrjsDAn2

— IndianPremierLeague (@IPL) April 11, 2021