IND vs AFG : అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు భార‌త్‌కు భారీ షాక్‌..! క‌ష్టాలు త‌ప్ప‌వా..?

అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ త‌గిలింది.

IND vs AFG : అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు భార‌త్‌కు భారీ షాక్‌..! క‌ష్టాలు త‌ప్ప‌వా..?

Team India

Updated On : January 7, 2024 / 7:38 PM IST

India vs Afghanistan : అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ త‌గిలింది. గాయాల‌తో టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు సూర్య‌కుమార్ యాద‌వ్‌, రుతురాజ్ గైక్వాడ్‌, హార్దిక్ పాండ్య‌లు దూరం అయ్యారు. ఈ విష‌యాన్ని ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్‌ఫో తెలిపింది. సూర్య‌కుమార్‌, హార్దిక్ పాండ్య‌లు ఐపీఎల్ 2024 సైతం ఆడేది క‌ష్ట‌మేన‌ని చెప్పింది. రుతురాజ్ ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ నాటికి కోలుకునే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వెల్ల‌డించింది.

అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ కోసం భార‌త జ‌ట్టును ఎంపిక చేసేందుకు సెల‌క్ట‌ర్లు ముంబైలో నేడు స‌మావేశం కానున్నారు. అజిత్‌ అగర్కార్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌తో పాటు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ (మొద‌టి రెండు టెస్టులు) కోసం జ‌ట్టును ప్ర‌క‌టించ‌నుంది. గ‌త సంవ‌త్స‌ర కాలంగా టీ20ల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్న రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ లు తిరిగి టీ20ల్లో పున‌రాగం చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

T20 World Cup 2024 : టీమ్ఇండియా కెప్టెన్సీ అత‌డికే ఇవ్వాలి.. కోహ్లీ ఓ అద్భుత ఆట‌గాడు : గంగూలీ

రోహిత్ సార‌థ్యంలోనే టీమ్ఇండియా బ‌రిలోకి దిగ‌నుంది. ఒక‌వేళ సెల‌క్ట‌ర్లు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ప్రాధాన్యం ఇస్తే అఫ్గాన్‌తో సిరీస్‌కు శుభ్‌మ‌న్ గిల్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశం ఉంది.

కెప్టెన్‌గా ఇబ్ర‌హీం జ‌ద్రాన్‌..

భార‌త్‌తో టీ20 సిరీస్ కోసం అఫ్గానిస్తాన్ 19 మందితో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించింది. కెప్టెన్‌గా ఇబ్ర‌హీం జ‌ద్రాన్‌ను నియ‌మించింది.
అఫ్గాన్ జ‌ట్టు ఇదే..
ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్‌), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీప‌ర్‌), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీప‌ర్‌), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్, ఫజల్, ఫజల్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీమ్, కైస్ అహ్మద్, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్.

Flash Flood : ఇదేందిదీ.. వ‌ర్షం లేదు.. అయినా పిచ్ పై వ‌ర‌ద‌.. వీడియో వైర‌ల్‌