T20 World Cup 2021 : చెలరేగిన భారత్.. అప్ఘానిస్తాన్ టార్గెట్ 211

టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా అప్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా చెలరేగింది. భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు.

T20 World Cup 2021 : చెలరేగిన భారత్.. అప్ఘానిస్తాన్ టార్గెట్ 211

T20 World Cup 2021 India

Updated On : November 3, 2021 / 10:30 PM IST

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ లో ఎట్టకేలకు భారత్ చెలరేగింది. సూపర్ 12లో భాగంగా అప్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. కసితీరా కొట్టారు. ఫలితంగా కోహ్లి సేన భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది.

Google Chrome Warn : క్రోమ్‌ యూజర్లకు గూగుల్ వార్నింగ్.. వెంటనే పాస్‌వర్డ్ మార్చుకోండి!

టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (47 బంతుల్లో 74 పరుగులు), కేఎల్ రాహుల్(48 బంతుల్లో 69 పరుగులు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత్ కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత పంత్ (13 బంతుల్లో 27 పరుగులు), హార్ధిక్ పాండ్యా (13 బంతుల్లో 35 పరుగులు) మెరుపులు మెరిపించారు. దీంతో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. అప్ఘానిస్తాన్ బౌలర్లలో నయిబ్, కరీమ్ జనత్ తలో వికెట్ తీశారు.

కాగా, టీ20 వరల్డ్ కప్ 2021లో అత్యధిక పరుగులు(210) చేసిన జట్టుగా టీమిండియా నిలిచింది. భారత్ తర్వాత అప్ఘానిస్తాన్ రెండో స్థానంలో ఉంది. స్కాట్లాండ్ పై ఆ జట్టు 190/4 పరుగులు చేసింది. ఇక ఇవాళ్టి మ్యాచ్ లో భారత్ 10 సిక్సర్లు బాదింది.

మరోవైపు రోహిత్, కేఎల్ రాహుల్ కీలక భాగస్వామ్యం ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్ లో భారత్ కు ఇదే అత్యధిక భాగస్వామ్యం.
* 140 పరుగులు.. రోహిత్-రాహుల్ Vs అప్ఘానిస్తాన్ 2021
* 136 పరుగులు.. సెహ్వాగ్-గంభీర్ Vs ఇంగ్లండ్ 2007
* 106 పరుగులు.. రోహిత్-కోహ్లి Vs వెస్టిండీస్ 2014
* 100 పరుగులు.. రోహిత్-కోహ్లి Vs బంగ్లాదేశ్ 2014