T20 World Cup-2022: బంగ్లాదేశ్‌కు 185 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా అడిలైడ్ ఓవల్ లో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ కు టీమిండియా 185 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. టీమిండియా బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించి అర్ధ సెంచరీలు బాదారు.

T20 World Cup-2022: బంగ్లాదేశ్‌కు 185 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా

Updated On : November 2, 2022 / 3:40 PM IST

T20 World Cup-2022: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా అడిలైడ్ ఓవల్ లో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ కు టీమిండియా 185 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. టీమిండియా బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించి అర్ధ సెంచరీలు బాదారు.

టీమిండియా బ్యాట్స్‌మెన్ లో కేఎల్ రాహుల్ 50, రోహిత్ శర్మ 2, విరాట్ కోహ్లీ 64 (నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ 30, హార్దిక్ పాండ్యా 5, దినేశ్ కార్తీక్ 7, అక్షర్ పటేల్ 7, రవిచంద్రన్ అశ్విన్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో హాసన్ మహ్ముద్ 3, షాకిబ్ అల హాసన్ 2 వికెట్లు తీశారు.

కాగా, టీ20 ప్రపంచ కప్ లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో టీమిండియా రెండు మ్యాచులు గెలిచింది. ఓ మ్యాచులో ఓడిపోయింది. నేటి మ్యాచులో గెలిస్తే భారత్ సెమీ ఫైనల్ వెళ్లే అవకాశాలు ఉంటాయి. టీ20 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ తో పాటు టీమిండియాకు చెరో నాలుగు పాయింట్లు ఉన్నాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..