T20 World Cup Row : బంగ్లాదేశ్‌కు ఐసీసీ భారీ షాక్‌.. ఆడితే భార‌త్‌లో ఆడండి.. లేదంటే మీ ఇష్టం.. 24 గంట‌ల టైమ్‌

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో (T20 World Cup Row) త‌మ జ‌ట్టు ఆడే మ్యాచ్‌ల‌ను భార‌త్ నుంచి శ్రీలంక‌కు మార్చాల‌ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞ‌ప్తిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తిరస్కరించింది.

T20 World Cup Row : బంగ్లాదేశ్‌కు ఐసీసీ భారీ షాక్‌.. ఆడితే భార‌త్‌లో ఆడండి.. లేదంటే మీ ఇష్టం.. 24 గంట‌ల టైమ్‌

T20 World Cup Row ICC rejected Bangladesh Cricket Board request

Updated On : January 22, 2026 / 9:14 AM IST
  • బంగ్లాదేశ్ విజ్ఙ‌ప్తిని తిర‌స్క‌రించిన ఐసీసీ
  • భార‌త్‌లో ఆడాల్సిందే
  • 24 గంట‌ల్లో నిర్ణ‌యం చెప్పాల‌ని బీసీబీకి వార్నింగ్‌

T20 World Cup Row : భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో త‌మ జ‌ట్టు ఆడే మ్యాచ్‌ల‌ను భార‌త్ నుంచి శ్రీలంక‌కు మార్చాల‌ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞ‌ప్తిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తిరస్కరించింది. ముందుగా నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కార‌మే మ్యాచ్‌లు జ‌రుగుతాయ‌ని స్ప‌ష్టం చేసింది.

బుధ‌వారం బంగ్లాదేశ్ చేసిన విజ్ఞ‌ప్తిపై ఐసీసీ అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని ఏర్పాటు చేసింది. ఓటింగ్ ద్వారా నిర్ణ‌యాన్ని తీసుకుంది. బంగ్లాదేశ్ కు వ్య‌తిరేకంగా 14 ఓట్లు రాగా అనుకూలంగా రెండు ఓట్లు ప‌డ్డాయి. దీంతో బంగ్లాదేశ్ ప్ర‌తిపాద‌న‌ను ఐసీసీ తిర‌స్క‌రించింది.

Abhishek Sharma : కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌.. అభిషేక్ శ‌ర్మ ప్రపంచ రికార్డు.. ఆండ్రీ రస్సెల్ రికార్డు బ్రేక్‌..

ఇక అదే స‌మ‌యంలో భార‌త దేశంలో బంగ్లాదేశ్ భ‌ద్ర‌త‌కు ఎలాంటి ముప్పు లేద‌ని తెలిపింది. టోర్నీలో పాల్గొంటారా? లేదా ? అనే విష‌యం చెప్పేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కు 24 గంట‌లు గ‌డువు ఇచ్చింది.

ఒక‌వేళ బంగ్లాదేశ్ గ‌నుక భార‌త్‌కు వెళ్లేందుకు నిరాక‌రిస్తే వారి స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్న‌మెంట్‌లో ఆడిస్తామ‌ని హెచ్చ‌రించింది. దీంతో బంగ్లాదేశ్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందోన‌ని స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

IND vs NZ : మ్యాచ్ గెలిచినా అదొక్క‌టే లోటు.. హోటల్‌లో, టీమ్ బస్సులో ఉన్నప్పుడు కూడా.. సూర్య‌కుమార్ యాద‌వ్ కామెంట్స్‌..

ఫిబ్ర‌వరి 7 నుంచి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 ప్రారంభం కానుంది. వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌, నేపాల్, ఇట‌లీ జ‌ట్ల‌తో క‌లిసి బంగ్లాదేశ్ గ్రూప్‌-సిలో ఉంది. షెడ్యూల్ ప్ర‌కారం గ్రూప్‌ ద‌శ‌లో నాలుగు మ్యాచ్‌ల‌ను భార‌త దేశంలో బంగ్లాదేశ్ ఆడ‌నుంది. తొలి మూడు మ్యాచ్‌లు కోల్‌క‌తా వేదిక‌గా ఆడ‌నుండ‌గా, చివ‌రి మ్యాచ్ ముంబైలో ఆడాల్సి ఉంది.