IND vs ENG : కంకషన్ వివాదంపై తొలిసారి స్పందించిన గంభీర్.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లకు ఇచ్చి పడేశాడు.. దూబె గనుక..
కంకషన్ వివాదంపై గంభీర్ తొలిసారి స్పందించాడు.

Team India head coach Gambhir breaks silence on Rana-Dube's like to like replacement query
ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 4-1తో తేడాతో కైవసం చేసుకుంది. ఆదివారం ముంబైలో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌ను భారత్ 150 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ విజయానంతరం టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడాడు. ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. కుర్రాళ్ల ఆటతీరు చూస్తుంటే గర్వంగా ఉందన్నాడు. అభిషేక్ శర్మ సెంచరీ ఎంతో ప్రత్యేకం అని అన్నాడు. ఈ క్రమంలో కంకషన్ వివాదంపై కూడా గంభీర్ తొలిసారి స్పందించాడు.
నాలుగో టీ20 మ్యాచ్ సందర్భంగా శివమ్ దూబె స్థానంలో హర్షిత్ రాణా కంకషన్ సబ్‌గా వచ్చాడు. ఈ మ్యాచ్‌లో రాణా మూడు వికెట్లు తీసి టీమ్ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో కంకషన్ సబ్ పై వివాదం చేలరేగింది. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు కంకషన్ సబ్‌గా హర్షిత్ రాణా రావడాన్ని తప్పుబట్టారు. ఐదో టీ20 అనంతరం దీనిపై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ఓ ప్రశ్నను గంభీర్‌ను అడిగారు. ఈ మ్యాచ్‌లో (ఐదో టీ20) శివమ్ దూబె నాలుగు ఓవర్లు వేసేవాడు. అయితే..అతడికి ఆ అవకాశం రాలేదన్నాడు. రెండు ఓవర్లలోనే అతడు రెండు వికెట్లు పడగొట్టాడు అని గంభీర్ సమాధానం ఇచ్చాడు.
ఐదో టీ20 మ్యాచ్‌లో దూబె వేసిన తొలి బంతికే డేంజర్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ వికెట్ తీశాడు. ఆ ఆరువాత జాకబ్ బెత్‌వెల్‌ను బౌల్ చేసి రెండో వికెట్ సాధించాడు. దూబె అంత మంచి బౌలర్ కాదని అతడి స్థానంలో హర్షిత్ రాణాను ఎలా తీసుకుంటారు అని ఇంగ్లాండ్ మాజీలు తప్పుబట్టగా.. ఐదో టీ20లో దూబె ప్రదర్శన ను చూపుతూ వారికి గంభీర్ ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం గంభీర్ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
ఫలితాలు అనుకూలంగా వస్తున్నప్పుడు అంతా బాగుంటుంది..
ఇక సిరీస్ గెలవడం పై గంభీర్ స్పందించాడు. ఇంగ్లాండ్ ఎంతో బలమైన జట్టు అని చెప్పాడు. ఏదో ఒక మ్యాచ్‌లో ఓడిపోయినంత మాత్రాన తాము భయపడమని చెప్పుకొచ్చాడు. ప్రతి మ్యాచ్‌లోనూ ఆటగాళ్లు దూకుడుగానే ఆడేందుకు ప్రయత్నిస్తారన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో 250 ఫ్లస్ స్కోరు సాధించాలనే బరిలోకి దిగామన్నాడు. కొన్నిసార్లు 120 కే ఆలౌట్ అయిన సందర్భాలు చూశామన్నాడు.
ఇక అభిషేక్ శర్మ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. ‘ఇలాంటి కుర్రాళ్లకు మద్దతుగా నిలవాలి. ఈ మ్యాచ్‌లో అభిషేక్ చేసిన శతకం ఎంతో ప్రత్యేకమైంది. ఇక ఫలితాలు మనకు అనుకూలంగా వస్తున్నప్పుడు అంతా బాగానే ఉంటుందన్నాడు. టాప్ -7 బ్యాటర్లు దూకుడుగా ఆడాలని తాము కోరుకుంటాం, ఫిక్స్‌డ్ బ్యాటింగ్ ఆర్డర్ అంటూ ఏదీ లేదు.’ అని గంభీర్ అన్నాడు.