‘దండంరా దొరా..’ పంత్ బ్యాంటింగ్ కి కేఎల్ రాహుల్ రియాక్షన్.. ఇక గంభీర్ అయితే.. డ్రెస్సింగ్ రూమ్ సీన్ వైరల్..
ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ శుక్రవారం లీడ్స్‌లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమైంది.

TeamIndia
IND vs ENG: ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ శుక్రవారం లీడ్స్‌లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమైంది. తొలిరోజు భారత్ జట్టు ఇంగ్లాండ్ పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మూడు వికెట్లు కోల్పోయి 359 పరుగులతో పటిష్ఠ స్థితిలో ఉంది. అయితే, తొలిరోజు మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ వద్ద శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ లకు తోటి క్రికెటర్లు గ్రాండ్ వెల్కమ్ పలికారు. కోచ్ గౌతమ్ గంభీర్ వారిని ఆప్యాయంగా హత్తుకొని అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.
తొలి టెస్టులో భాగంగా భారత జట్టు బ్యాటింగ్ ను ప్రారంభించింది. ఇంగ్లాండ్ బౌలర్లను టీమిండియా బ్యాటర్లు సమర్ధవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టారు. కెప్టెన్ శుభ్ మన్ గిల్ (127 నాటౌట్), ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (101 పరుగులు 159 బంతుల్లో), కేఎల్ రాహుల్ (42 పరుగులు 78 బంతుల్లో), వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ (65 నాటౌట్) రాణించారు. సాయి సుదర్శన్ మాత్రం డకౌట్ రూపంలో పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ బాటపట్టాడు.
Also Read: IND vs ENG: అయ్యో సాయి సుదర్శన్.. ప్లాన్‌చేసి మరీ అవుట్ చేశారుగా.. గంభీర్ రియాక్షన్ వైరల్..
చివరి రోజు ఆట ముగిసే సమయానికి శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ లు క్రీజులో ఉన్నారు. నాలుగో వికెట్‌కు శుభ్‌మన్-పంత్ జంట 138 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దీంతో తొలిరోజు మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ కు చేరుకున్న పంత్, గిల్ కు కేఎల్ రాహుల్, శార్దూల్ ఠాకూర్, ఇతర క్రికెటర్లు గ్రాండ్ వెల్కమ్ పలికి అభినందించారు. కోచ్ గౌతమ్ గంభీర్ శుభమన్ గిల్, రిషబ్ పంత్‌ను ఆప్యాయంగా హత్తుకొని అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
𝗥𝗮𝘄 𝗘𝗺𝗼𝘁𝗶𝗼𝗻𝘀
Straight from the #TeamIndia Dressing Room after the end of an exciting Day 1 at Headingley#ENGvIND pic.twitter.com/oj4kWMSbeW
— BCCI (@BCCI) June 20, 2025