ఐసీసీ ర్యాంకులు: కోహ్లీ మళ్లీ టాప్‌యే, ఎగబాకిన బుమ్రా, పంత్‌లు
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి హవా కొనసాగుతోంది. ఆసీస్ గడ్డ మీద తొలిసారి టెస్టు సిరీస్ విజయాన్ని అందుకున్న కోహ్లి ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అతడు 922 పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు.

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి హవా కొనసాగుతోంది. ఆసీస్ గడ్డ మీద తొలిసారి టెస్టు సిరీస్ విజయాన్ని అందుకున్న కోహ్లి ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అతడు 922 పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 897 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. టెస్టు ఫార్మాట్‌లో భారత్ ఖాతాలో 116 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా ఉండగా.. రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా ఖాతాలో 110 పాయింట్లతో నిలిచింది.
ఆ తర్వాతి స్థానంలో ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా కంటే కేవలం ఒక్క పాయింట్ వ్యత్యాసంతో మూడో స్థానంలో నిలిచిపోయింది. ఆస్ట్రేలియా గడ్డ మీద అద్భుతంగా రాణించిన పుజారా టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మూడోస్థానానికి చేరుకున్నాడు. యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ టాప్-20లో చేరుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో కెరీర్‌లోనే అత్యుత్తమంగా 17వ స్థానం సాధించాడు.
బౌలర్ల ర్యాకింగ్స్ విషయానికి వస్తే.. కగిసో రబాడ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టాప్-10లో చోటు దక్కించుకున్న అశ్విన్ (5వ), జడేజా (9వ) స్థానాల్లో ఉన్నారు. 711 పాయింట్లతో బుమ్రా 15వ స్థానానికి ఎగబాకాడు. బౌలర్ల జాబితాలోటీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్‌వన్ ర్యాంకును నిలబెట్టుకుంది.