Virat Kohli: విరాట్ కోహ్లీ.. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇచ్చేయాలి – అఫ్రీది
టీ20 ఫార్మాట్ కు కొత్త కెప్టెన్ తీసుకుని టీమిండియా కొత్త చాప్టర్ మొదలుపెట్టింది. రెగ్యూలర్ కెప్టెన్ గా రోహిత్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ తో తొలి సిరీస్ ఆడనుంది.

Virat Kohli
Virat Kohli: టీ20 ఫార్మాట్ కు కొత్త కెప్టెన్ తీసుకుని టీమిండియా కొత్త చాప్టర్ మొదలుపెట్టింది. రెగ్యూలర్ కెప్టెన్ గా రోహిత్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ తో తొలి సిరీస్ ఆడనుంది. ఇప్పటికీ వన్డే, టెస్టు క్రికెట్ కెప్టెన్సీలు కోహ్లీ చేతిలో ఉన్నాయి. దీనిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది స్పందించాడు. కోహ్లీ అలా చేయకుండా ఉండాల్సింది అంటున్నాడు. బ్యాటింగ్ మీద ఫోకస్ చేసి కేవలం ప్లేయర్ గానే కంటిన్యూ అవ్వాలనుకుంటే అన్ని ఫార్మాట్లకు కెప్టెన్సీ నుంచి గుడ్ బై చెప్పేయాల్సిందని కామెంట్ చేశాడు.
ఇండియన్ క్రికెట్ లో అతనికి అద్భుతమైన బలం ఉందని నమ్ముతున్నా. కానీ, కెప్టెన్ గా రిటైర్ అవ్వాలనుకుంటే అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పేసి.. గేమ్ పైనే ఫోకస్ పెట్టాలి’ అని మీడియా ముందు చెప్పాడు.
ఇండియన్ క్రికెట్ టీంను రోహిత్ శర్మ లీడ్ చేయగలడనే విశ్వాసాన్ని కనబరిచాడు అఫ్రీది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా డెక్కన్ ఛార్జర్స్ కు ఆడుతున్న సమయంలో అఫ్రీది.. రోహిత్ శర్మతో పాటు డ్రెస్సింగ్ రూం షేర్ చేసుకున్నాడు. రోహిత్ చాలా ప్రశాంతంగా పరిస్థితులు తగ్గట్లు నడుచుకుంటూ క్యాపబుల్ లీడర్ అనిపించుకుంటాడని చెప్పాడు.
………………………………….: మోదీకి గిఫ్ట్‌గా చీర.. మీరు చూశారా
కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనూ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ వదిలేశాడు. 33ఏళ్ల కోహ్లీ.. వర్క్ లోడ్, బ్యాటింగ్ పై ఫోకస్ గురించి మాత్రమే ఆలోచిస్తానని అన్నాడు. 2023వరల్డ్ కప్ వరకూ వన్డే ఫార్మాట్ కెప్టెన్ గా కోహ్లీనే ఉంటాడా అనేది అనుమానంగానే మిగిలిపోయింది.