టీ20 వరల్డ్‌కప్.. అమెరికా చేతిలో పాకిస్థాన్ ఓటమిపై వసీం అక్రమ్ ఫైర్
గెలుపోటములు ఆటలో భాగం. కానీ ఇంత చెత్తగా ఆడితే ఓడిపోవడం ఖాయం. ఈవిధమైన ఆటతీరు పాకిస్థాన్ క్రికెట్‌కు ఏమాత్రం మంచిది కాదు.

Wasim Akram: టీ20 వరల్డ్‌కప్‌లో పెను సంచలనం నమోదయింది. పాకిస్థాన్ జట్టుపై అమెరికా సంచలన విజయం సాధించింది. సూపర్ ఓవర్‌లో పాకిస్థాన్‌ను ఓడించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. క్రికెట్‌లో పసికూన అయిన అమెరికా జట్టుపై పాకిస్థాన్ ఓడిపోవడంపై పాక్ సీనియర్లు ఫైర్ అవుతున్నారు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో తమ జట్టు చెత్తగా ఆడిందని పాకిస్థాన్ మాజీ బౌలర్ వసీం అక్రమ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాగే ఆడితే నాకౌట్‌కు చేరుకోవడం చాలా కష్టమని కుండబద్దలు కొట్టాడు.
“గెలుపోటములు ఆటలో భాగం. కానీ ఇంత చెత్తగా ఆడితే ఓడిపోవడం ఖాయం. ఈవిధమైన ఆటతీరు పాకిస్థాన్ క్రికెట్‌కు ఏమాత్రం మంచిది కాదు. మీరు చివరి బంతి వరకు గట్టిగా పోరాడాలి. సూపర్ ఎయిట్‌కి అర్హత సాధించడానికి పాకిస్తాన్ తర్వాత చాలా కష్టపడాలి. ఎందుకంటే జూన్ 9న భారత్‌తో కీలక మ్యాచ్ ఆడబోతోంది. ఆ తర్వాత మరో రెండు మంచి జట్లతో (ఐర్లాండ్, కెనడా) ఆడాల్సివుంద”ని వసీం అక్రమ్ స్టార్ స్సోర్ట్స్‌తో అన్నారు.
అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో పవర్ ప్లే ముగిసే సమయానికి పాకిస్థాన్ 3 వికెట్లు కోల్పోయి 30 పరుగులే చేసింది. కెప్టెన్ బాబర్, షాదాబ్ ఖాన్ నాల్గవ వికెట్‌కు 72 పరుగులు జోడించినప్పటికీ భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. అమెరికా తొలి 3 వికెట్లు పడగొట్టడమే ఆటలో కీలక మలుపని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డారు. బాబర్, షాదాబ్ తర్వాత భారీ భాగస్వామ్యాలు నమోదుకాకపోవడం కూడా పాకిస్థాన్‌ను దెబ్బతీసిందన్నారు. పాకిస్తాన్ ఫీల్డింగ్‌తో పాటు ఆట కూడా సగటు కంటే తక్కువగా ఉందని విశ్లేషించారు.
Also Read: పాక్‌ను ఓడించిన అమెరికా ప్లేయర్ సౌరభ్ నేత్రవాలాకర్ ఎవరో తెలుసా?
అమెరికా కెప్టెన్‌పై ప్రశంసలు
సూపర్ ఓవర్‌లో అమెరికా బాగా ఆడిందని ప్రశంసించారు. సూపర్ ఓవర్‌లో అమెరికా 18 పరుగులు చేయడం పాకిస్తాన్ ఆశలను నీరుగార్చిందని చెప్పాడు. అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ తన బౌలింగ్ వనరులను సమర్థవంతంగా వినియోగించుకున్నాడని కితాబిచ్చాడు. ఫీల్డింగ్ కూడా బాగుందని, అమెరికా ఆకట్టుకునే ప్రదర్శన చేసిందని వసీం అక్రమ్ వ్యాఖ్యానించారు.
Also Read: బెస్ట్ ఫీల్డర్ అవార్డులో సూపర్ ట్విస్ట్.. ఆశ్చర్యపోయిన రోహిత్ శర్మ, కోహ్లి.. వీడియో వైరల్