Royal Challengers Bengaluru : ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. చిన్నస్వామికి ఆర్‌సీబీ గుడ్‌బై ! కొత్త హోం గ్రౌండ్ ఏమిటో తెలుసా?
ఐపీఎల్ 2026 మ్యాచ్‌లను చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించే అవకాశం లేదు. దీంతో Royal Challengers Bengaluru తమ హోం గ్రౌండ్‌ను మార్చే ఆలోచనలో ఉంది.
Where Will Royal Challengers Bengaluru Play home matches in IPL 2026 Season
Royal Challengers Bengaluru : 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్‌సీబీ ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే.. ఫైనల్ మ్యాచ్ జరిగిన మరుసటి రోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద విషాదం చోటు చేసుకుంది.
ఆర్‌సీబీ (Royal Challengers Bengaluru) నిర్వహించిన విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట చోటు చేసుకుని 11 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో చిన్నస్వామిలో ఎలాంటి మ్యాచ్‌లు నిర్వహించ కూడదని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
IND vs SA : కోల్‌కతా వేదికగా భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి టెస్టు.. వర్షం ముప్పు ఉందా?
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లను నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందలేదు. ఈ క్రమంలోనే 2026 టీ20 ప్రపంచకప్ వేదికల జాబితాలో కూడా ఈ స్టేడియానికి చోటు దక్కలేదు.
తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం ఐపీఎల్ 2026 మ్యాచ్‌లను చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించే అవకాశం లేదు. దీంతో ఆర్‌సీబీ జట్టు తమ హోం గ్రౌండ్‌ను మార్చే ఆలోచనలో ఉంది.
Ishan Kishan : ఇషాన్ కిషన్ ఐపీఎల్ భవిష్యత్తు పై సన్‌రైజర్స్ హైదరాబాద్ అధికారిక ప్రకటన..
పూణేలోని గహున్జే స్టేడియంలో ఆర్‌సీబీ తమ హోమ్ మ్యాచ్‌లు అన్నింటిని ఆడాలని భావిస్తోంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కూడా గహున్జే స్టేడియాన్ని ఆర్సీబీకి తాత్కాలిక హోం గ్రౌండ్‌గా ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ప్రస్తుతం దీనిపై చర్చలు నడుస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. కొన్ని సాంకేతిక అంశాలు పరిష్కారం అయితే.. అప్పుడు పూణే ఆర్‌సీబీకి హోంగ్రౌండ్‌గా మారే అవకాశం ఉంది.
